రేప్, మర్డర్ కేసులో వ్యక్తికి జీవితఖైదు

 రేప్, మర్డర్ కేసులో వ్యక్తికి జీవితఖైదు

వికారాబాద్, వెలుగు: మహిళపై అత్యాచారం, హత్య కేసులో వ్యక్తికి జీవితఖైదు విధిస్తూ వికారాబాద్ ఒకటో అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు మంగళవారం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఎస్పీ స్నేహ మెహ్రా వివరాల ప్రకారం.. 2024లో పులుమద్ది గ్రామ శివారులో చేవెళ్లకు చెందిన ఎర్రోల్ల అనుసూజ అనే మహిళ హత్యకు గురైంది. టెక్నికల్ ఆధారాలతో నిందితుడిని మద్గుల్ చిట్టంపల్లికి చెందిన తలారి బాబుగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పక్కా ఆధారాలతో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.

వాదోపవాదాలు పరిశీలించిన జడ్జి సిహెచ్. చంద్ర కిషోర్.. నిందితుడిపై నేరం రుజువు కావడంతో హత్య చేసినందుకు జీవితకాల జైలు శిక్షతో పాటు, ఆధారాలు చెరిపివేసినందుకు 7 ఏండ్లు, సొత్తు అపహరించినందుకు 3 ఏండ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.