చంద్ర గ్రహణం 2025 : గ్రహణ ప్రభావం తీవ్రంగా ఉండే సమయం, పట్టు విడుపుల టైం కచ్చితంగా తెలుసుకోండి..

చంద్ర గ్రహణం 2025 : గ్రహణ ప్రభావం తీవ్రంగా ఉండే సమయం, పట్టు విడుపుల టైం కచ్చితంగా తెలుసుకోండి..

భాద్రపద పౌర్ణమి సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం .. ఈ ఏడాదిలో చివరి చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం...  సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్ర గ్రహణ ప్రభావం తీవ్రంగా ఉండే సమయం, మధ్య సమయం..  పట్టు విడుపులసమయాల గురించి వివరంగా తెలుసుకుందాం. . .

 రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం   కుంభరాశిలో శతభిషం..  పూర్వాభాద్ర నక్షత్రాలలో ఇది సంభవించును.  భాద్రపద మాసం శుక్ల పక్ష పౌర్ణమి రోజున  .. సెప్టెంబర్​ 7న సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది.  ఈ గ్రహణం రాత్రి 9:58కి ప్రారంభమవుతుంది.  గ్రహణ వ్యవధి మొత్తం 3.28 నిమిషాలు ఉంటుంది. సెప్టెంబర్ 7 రాత్రి 11:42 గంటలకు చంద్రుడు సంపూర్ణంగా కనపడడు. ఈ సమయంలో గ్రహణ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.  

  •   గ్రహణం మొదలయ్యే సమయం ( గ్రహణ స్పర్శకాలం)  :  సెప్టెంబర్​ 7  రాత్రి 9-58  గంటలకు 
  • గ్రహణం మధ్యలోకి  వెళ్లే సమయం ( ఉన్మీలన కాలం):  సెప్టెంబర్​ 7  రాత్రి 10-58 గంటలకు .. గ్రహణం ప్రభావం తీవ్రతరంకావడం ప్రారంభిస్తుంది. 
  • గ్రహణ మధ్య కాలం :  సెప్టెంబర్​ 7   రాత్రి  11- 42 గంటలకు  .. ఈ సమయానికి చంద్రుడు అసలు కనపడడు.  ఈ సమయంలో గ్రహణం ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. 
  •  గ్రహణం పూర్తిగా పట్టే   సమయం (నిమీలన కాలం)  :  సెప్టెంబర్​ 7 ( తెల్లవారితే 8  వతేది) రాత్రి12-24  గంటలకు .. ఇప్పటి వరకు గ్రహణ ప్రభావం అధికంగా ఉంటుంది. 
  •  గ్రహణం విడవడం ప్రారంభించే సయం (గ్రహణ మోక్షకాలం) : సెప్టెంబర్​ 7 రాత్రి ( తెల్లవారితే 8)   1–31 గంటలకు .. గ్రహణ ప్రభావం తగ్గడం ప్రారంభమవుతుంది. 
  •  గ్రహణం  పూర్తిగా ముగిసే సమయం (అద్యంత పుణ్యకాలం)  : ( సెప్టెంబర్​ 8) తెల్లవారుజామున 3-41 గంటలకు .. పూర్తిగా గ్రహణ ప్రభావం తగ్గుతుంది. 

జపాలు .. అనుష్టానం చేసే వారు గ్రహణం స్పర్శకాలానికి ముందే స్నానం చేసి ఆ సమయానికి ప్రారంభించాలి.   తరువాత గ్రహణం పూర్తిగా విడిచేంత వరకు అంటే సెప్టెంబర్​ 8 వ తేది తెల్లవారు జామున 3.41 నిమిషాల వరకు జపం చేసి.. గ్రహణం విడుపు స్నానం చేసి.. దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకొని దీపారాధన చేయాలి.  ఆ తరువాత శివాలయాన్ని.. నవగ్రహాలను దర్శించుకోవాలని పండితులు చెబుతున్నారు.  

►ALSO READ | చంద్ర గ్రహణం 2025 : ఏయే రాశుల వాళ్లు.. గ్రహణ సమయంలో ఎలాంటి మంత్రం పఠించాలో తెలుసుకోండి..