
జ్యోతిష్య శాస్త్రప్రకారం సెప్టెంబర్ 7న ఏర్పడే చంద్రగ్రహణం.. అన్ని రాశులపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఆ రోజున రాహు గ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అంటే కుంభరాశిలో రాహువు.. చంద్రుడు సంచరిస్తారు. మిథునంలో గురుడు... .. సింహరాశిలో కేతువుతో పాటు శుక్రుడు.. కుజుడు కన్యారాశిలో.. బుధుడు తులారాశిలో.. రాహువు కుంభరాశిలో .. శని దేవుడు .. మీన రాశిలో తిరోగమనంలో సంచరిస్తుండగా .. రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది. గ్రహణ ప్రభావం 48 రోజులు ఉంటుంది. వీటి వలన 12 రాశుల వారికి కచ్చితంగా గ్రహణ ప్రభావం ఉంటుంది. ఏ రాశి వారికి ఎలాంటి సమస్యలు వస్తాయి.. గ్రహణం సమయంలో ఏదేవుడిని ఆరాధించాలి.. ఏ మంత్రం పఠించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .
మేషరాశి : ఈ రాశి వారికి రాహుగ్రస్త చంద్రగ్రహణం వలన మానసికంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. గ్రహణం సమయంలో సుబ్రమణ్యస్వామిని పూజిస్తూ.. . ఓం శరవణభవ అనే మంత్రాన్ని పఠించాలి.
వృషభ రాశి : చంద్ర గ్రహణ ప్రభావం వలన ఈ రాశి వారికీ ఆర్థిక సమస్యలు.. కుటుంబ కలహాలు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని జపం చేస్తూ ఉండాలి.
ALSO READ : సెప్టెంబర్ 7 చంద్ర గ్రహణం చాలా శక్తివంతం
మిథున రాశి : చంద్రగ్రహణం సమయంలో నవగ్రహాల కదలికల ఆధారంగా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ రాశి వారు అనవసర ఆలోచనలతో గందరగోళ పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంది. కావున ఈ రాశి వారు ఉపశమనం.. శాంతి కోసం గ్రహణ సమయంలో శ్రీ విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ.. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని గ్రహణం ప్రారంభమైన దగ్గరి నుంచి.. వీడే వరకు అనుష్టానం చేయాలి.
కర్కాటక రాశి : ఈ రాశి వారికి కుటుంబ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశంఉంది. చంద్రుడి ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ రాశి వారు ఓం సోమాయ నమః మంత్రాన్ని జపం చేయాలని పండితులు సూచిస్తున్నారు.
సింహ రాశి : సెప్టెంబర్ 7 2025 న సంపూర్ణ చంద్రగ్రహణం వలన ఈ రాశి వారి ఆత్మవిశ్వాసం మీద ప్రభావం చూపిస్తుంది. సూర్య భగవానుడి ఆరాధించి ఓం సూర్యాయ నమః మంత్రాన్ని పఠించడం సత్పలితాలను పొందుతారని పండితులు అంటున్నారు.
కన్యా రాశి : గ్రహణ సమయంలో ఈ రాశిలో కుజుడు సంచారం చేయుచున్నారు. అందువలన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీరు ధన్వంతరి దేవుడిని ప్రార్థించి .. ఓం శ్రీ ధన్వంతరయ నమః మంత్రాన్ని గ్రహణ సమయంలో చదువుతూ ఉండాలి.
తులా రాశి : ఈ రాశిలో బుధుడు సంచరించే సమయంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడటం వలన .. ఈ రాశి వారికి మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. శివుడి ఆరాధన. ఓం నమః శివాయ మంత్రాన్ని జపించండి.
వృశ్చిక రాశి : రాహుగ్రస్త చంద్రగ్రహణం ప్రభావం లన వీరికి కొత్త సమస్యలు ఏర్పడవు కాని.. గతంలో ఉన్న సమస్యలు మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. కాళీమాతను ధ్యానిస్తూ.. ఓం కాళికాయై నమః అనే మంత్రాన్ని చదవడం వలన ఇబ్బంది ప్రభావం తగ్గుతుంది.
ధనుస్సు రాశి : ఈ రాశి వారు గ్రహణ సమయంలో గురుడిని పూజించాలి. ఓం గురవే నమః మంత్రాన్ని జపించండి.
మకర రాశి : ఈ రాశి వారికి గ్రహణ ప్రభావం ఎక్కువుగా ఉంటుంది, శని దేవుడిని ప్రార్థిస్తూ.. ఓం శనిశ్చరాయ నమః మంత్రాన్ని పఠించండి. ఇబ్బందులు తొలగుతాయి.
కుంభ రాశి : ఇదే రాశిలో రాహు గ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ రాశి వారిపై గ్రహణ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ రాశి వారు శివపార్వతులను ఆరాధించాలి. ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని అనుష్టానం చేయాలి.
మీన రాశి : ఈ గ్రహణ ప్రభావం వలన ఈ రాశి వారికి అనుకోని మార్పులు సంభవించే అవకాశం ఉంది. వీటి వలన అశాంతి ఏర్పడుతుంది. ప్రశాంతత కోసం వీరు దత్తాత్రేయ స్వామిని పూజించడం ... ఓం దత్తాత్రేయాయ నమః మంత్రాన్ని పఠించండి.