
సెప్టెంబర్ 7న ఆదివారం రాత్రి అరుదైన రాహు గ్రస్థ సంపూర్ణ చంద్రగ్రహణం జరుగనుంది. ఇది కుంభరాశిలో ఏర్పడుతుంది.చంద్రగ్రహణం సమయంలో, రాక్షస శక్తులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని నమ్ముతారు. ఈసారి, పూర్వాభద్ర నక్షత్రం కింద కుంభ రాశిలో గ్రహణం సంభవిస్తుంది. దీని కారణంగా కొన్ని ఐదు రాశులపై ( మిథున, కర్కాటక, మకర, కుంభ, మీన) ప్రభావం పడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. వీరితో పాటు పూర్వాభాద్ర, విశాఖ, పునర్వసు, శతభిష, ఉత్తరాభాద్ర నక్షత్రాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ గ్రహణం యొక్క ప్రభావాలు దాదాపు 40 రోజుల పాటు ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
మిథున రాశి : ఈ రాశి వారిపై గ్రహణం చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా ఇబ్బందులు, వ్యాపారస్తులకు వ్యాపారపరంగా తలనొప్పులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
కర్కాటక రాశి: ఈ రాశికి అధిపతి చంద్రుడు. ఈ రాశికి చెందిన వారిపై చంద్రగ్రహణ ప్రభావం ఎక్కువుగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆర్థిక సమస్యలు,, మానసిక ఆందోళన .. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
మకర రాశి: ఈ రాశి వారికి అనుకోని మార్పులు జరుగుతాయి. ఉద్యోగంలో అనుకోని మార్పులు సంభవిస్తాయి. అధికారుల ఒత్తిడి ఉంటుంది. ఏ పని చేయాలో అర్దంకాని పరిస్థితిలో ఉంటారు. ప్రతి పనికి ఆందోళన పడుతుంటారు. ఖర్చులు అధికంగా ఉంటాయి.
కుంభ రాశి: కుంభరాశికి అధిపతి రాహువు.. రాహుగ్రస్త చంద్రగ్రహణ ప్రభావంతో వీరికి ఆర్థిక నష్టాలుంటాయి. అనుకున్నపనులు చాలా ఆలస్యంగా కొనసాగుతాయి. ఆరోగ్య సమస్యలు.. కుటుంబసమస్యలతో సతమతమవుతారు.
మీనరాశి : ఈ రాశి వారికి అనవసర ఖర్చులు వేధిస్తాయి. ఆఫీసులో అనవసరంగా మాటపడాల్సి వస్తుంది. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ఉపశమనానికి ఏం చేయాలంటే..
- రోజూ దక్షిణామూర్తి స్త్రోత్రం చదవాలి.. లేకపోతే వినాలి.
- చంద్రగ్రహణం రోజున చంద్రుడికి.. రాహువుకి అభిషేకం చేయాలి
- శివాలయంలో పూజారికి బియ్యం.. మినుములు.. దక్షిణ తాంబూలం ఇవ్వాలి.
- రోజూ గోమాతకు తోటకూర తినిపించాలి.
- సోమవారం... శివాలయంలో అభిషేకం చేయాలి
- చంద్రగ్రహణం రోజున పేదవారికి బట్టలు దానం చేయాలి.
సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం (చంద్ర గ్రహణం) రాత్రి 9:56 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 1:52 గంటలకు ముగుస్తుంది. ఈ చంద్రగ్రహణం సూతక కాలం సెప్టెంబర్ 7న మధ్యాహ్నం 12:58 గంటలకు ప్రారంభమై గ్రహణం ముగిసే వరకు అమలులో ఉంటుంది. అటువంటి సంఘటనల సమయంలో, ఖగోళ కదలికలు గణనీయమైన ప్రభావాలను చూపుతాయి.