నవంబర్ 24న విక్రమ్ ధృవ నక్షత్రం రిలీజ్

నవంబర్ 24న విక్రమ్ ధృవ నక్షత్రం రిలీజ్

బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విక్రమ్.  దాదాపు ఏడేళ్లుగా ఆగుతూ వస్తున్న ‘ధృవ నక్షత్రం’ సినిమా నవంబర్ 24న విడుదలవుతోంది.  గౌతమ్ మీనన్ దర్శకనిర్మాతగా రూపొందించిన ఈ స్పై థ్రిల్లర్‌‌‌‌లో విక్రమ్.. ఏజెంట్ ధృవ్, జాన్ అనే రెండు క్యారెక్టర్స్‌‌లో కనిపించనున్నాడు. రీతూ వర్మ హీరోయిన్‌‌గా నటించింది. ఈ చిత్రం  నుంచి ‘కరిచే కళ్లే..’ లిరికల్ సాంగ్‌‌ను రిలీజ్ చేశారు. హారీస్ జైరాజ్ కంపోజ్ చేసిన పాటకు రాకేందు మౌళి లిరిక్స్ రాయగా,  శ్రీలేఖ పార్థసారధి పాడారు.

కరిచే కళ్లే చూసి కుదేలయ్యానయ్యా... గరుకు ఒళ్లే నన్ను లాగెనురా బాయ్యా.. వయసిక ఆగనంది అట్టా ఇట్టాగుంది.. యెంటనే తాంబూలాలు మార్చేసుకోమంది...’ అంటూ హీరోయిన్ లవ్ ఫీలింగ్స్ చెబుతూ సాగే పాటలో విక్రమ్, రీతూ వర్మ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఐశ్వర్య రాజేష్, పార్తిబన్, రాధిక, సిమ్రాన్, వినాయకన్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. 

ALSO READ : అడవిలో ఉంటాడు.. నీడై తిరుగుతుంటాడు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ఈగల్ టీజర్