అడవిలో ఉంటాడు.. నీడై తిరుగుతుంటాడు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ఈగల్ టీజర్

అడవిలో ఉంటాడు.. నీడై తిరుగుతుంటాడు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ఈగల్ టీజర్

మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) హీరోగా వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ఈగల్(Eagle). పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ(Peoples media factory) నిర్మిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని(Karthik gattamaneni) దర్శకత్వం వహిస్తున్నాడు. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్(Anupama parameswaran) హీరోయిన్ గా నటిస్తుండగా.. 2023 సంక్రాతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈగల్ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రవితేజ మాస్ అవతార్ లో కనిపిస్తున్న ఈ టీజర్ చాలా స్టైలీష్ గా ఉంది. ఇక టీజర్ లో అనుపమ అతను ఎక్కడ ఉంటాడు అని అడగగా.. అడివిలో ఉంటాడు.. నీడై తిరుగుతుంటాడు అని రవితేజ గురించి చెప్పిన డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచేసింది. రవితేజ ఫ్యాన్స్ కూడా టీజర్ చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి టీజర్ తో అంచనాలు పెంచేస్తున్న ఈ సినిమా రిలీజ్ తరువాత ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి. 

ALSO READ : సిద్ధంగా ఉండండి.. దీపావళికి సినిమా పండుగ.. OTTలో ఏకంగా 23 సినిమాలు