సిద్ధంగా ఉండండి.. దీపావళికి సినిమా పండుగ.. OTTలో ఏకంగా 23 సినిమాలు

సిద్ధంగా ఉండండి.. దీపావళికి సినిమా పండుగ.. OTTలో ఏకంగా 23 సినిమాలు

వీకెండ్ అయినా.. పండుగ రోజైనా.. ఆడియన్స్ కు ముందుగా గుర్తొచ్చేది సినిమా. హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. మేకర్స్ కూడా పండుగ సీజన్ కోసం తమ సినిమా రిలీజ్ లు ప్లాన్ చేసుకుంటారు. కేవలం థియేటర్స్ లోనే కాదు ఓటీటీలో కూడా కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఈ దీపావళి పండుగ సందర్బంగా వరుస సినిమాలు ఆడియన్స్ ను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? ఏ సినిమా.. ఏ రోజు.. ఎక్కడ స్ట్రీమింగ్ అవనుంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

 • నవంబర్‌ 7: రెయిన్‌ బో రిష్టా (ఇంగ్లీష్‌ డాక్యు సిరీస్‌) 
 • నవంబర్‌ 9: బీటీఎస్‌: ఎట్‌ టూ కమ్‌ (కొరియన్‌ మూవీ) 
 • నవంబర్‌ 10: పిప్పా (హిందీ సినిమా), 007: రోడ్‌ టు ఎ మిలియన్‌ (గేమ్‌ షో), దీనా హశేం: డార్క్‌ లిటిల్‌ విస్పర్స్‌(షో)

హాట్‌స్టార్‌

 • నవంబర్‌ 8: ది శాంటాక్లాజ్స్‌ (వెబ్‌ సిరీస్‌, రెండో సీజన్‌), విజిలాంటి (కొరియన్‌ వెబ్‌ సిరీస్‌)
 • నవంబర్‌ 10: లేబుల్‌ (తెలుగు వెబ్‌ సిరీస్‌) 

Also Read :- AI ఎంత డేంజరో

నెట్‌ఫ్లిక్స్‌

 • నవంబర్‌ 6: ఇరుగుపట్రు(తమిళ చిత్రం), రిక్‌ అండ్‌ మార్టీ సీజన్‌ 7
 • నవంబర్‌ 8: ఎస్కేపింగ్‌ ట్విన్‌ ఫ్లేమ్స్‌(వెబ్‌ సిరీస్‌), సైబర్‌ బంకర్‌: ద క్రిమినల్‌ అండర్‌వరల్డ్‌ (డాక్యుమెంటరీ), రాబీ విలియమ్స్‌ (వెబ్‌ సిరీస్‌), ద క్లాస్‌ ఫ్యామిలీ 3
 • నవంబర్‌ 9: అకుమా కున్‌ (యానిమేషన్‌ సిరీస్‌) 
 • నవంబర్‌ 10: ది కిల్లర్‌ (హాలీవుడ్‌), ఎట్‌ ద మూమెంట్‌ (వెబ్‌ సిరీస్‌), ఫేమ్‌ ఆఫ్టర్‌ ఫేమ్‌ (సిరీస్‌)

జీ5

 • నవంబర్‌ 10: ఘూమర్‌ (హిందీ సినిమా) 

బుక్‌ మై షో

 • నవంబర్‌ 7: ది రాత్‌ ఆఫ్‌ బెక్కీ (హాలీవుడ్‌ చిత్రం), యు హర్ట్‌ మై ఫీలింగ్స్‌ (హాలీవుడ్‌ సినిమా) 
 • నవంబర్‌ 10: ది అడల్ట్స్‌ (హాలీవుడ్‌ మూవీ)

ఆపిల్‌ టీవీ ప్లస్‌

 • నవంబర్‌ 8: ద బుకనీర్స్‌