రష్మిక డీప్ ఫేక్ వీడియో వైరల్.. తీవ్రంగా స్పందించిన కేంద్ర మంత్రి

రష్మిక డీప్ ఫేక్ వీడియో వైరల్.. తీవ్రంగా స్పందించిన కేంద్ర మంత్రి

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika mandanna) డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై నెటిజన్స్ తో పాటు, స్టార్స్ కూడా మండిపడుతున్నారు. ఇప్పటికే ఈ విషయంపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పందించారు. ఈ వీడియో మార్పింగ్ చేసిన వారిపై లీగల్ యాక్షన్ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

తాజాగా ఇదే విషయంపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తీవ్రంగా స్పందించారు. ఇండియాలో ఐటీ నిబంధనలు ఉల్లంగించే ఏ కంటెంట్ అయినా తీసేయాలని సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ కు గుర్తుచేశారు. లేదంటే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 

 
2023 ఏప్రిల్ లో తెలియజేయబడిన IT నిబంధనల ప్రకారం.. ఇంటర్నెట్‌ ఉపయోగిస్తున్న వారందరికీ భద్రత, నమ్మకాన్ని కల్పించడానికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందులో భాగంగానే.. ఏ యూజర్ ద్వారా అయినా తప్పుడు సమాచారం పోస్ట్ చేయబడిందని తెలిస్తే వారికి చట్టపరమైన చర్యలు తప్పవు. ఆ తప్పుడు సమాచారం 36 గంటల్లో తీసివేయబడుతుంది. వారికి రూల్ 7 వర్తిస్తుంది. IPC నిబంధనల ప్రకారం తప్పుడు సమాచారం పోస్ట్ చేసిన ప్లాట్‌ఫారమ్‌లను కోర్టుకు తీసుకెళ్లడం జరుగుతుంది.. అని చెప్పుకొచ్చారు.