
మహేష్ బాబు కొత్తచిత్రం ‘సర్కారు వారి పాట’ అప్‌డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. సంక్రాంతికి రావాల్సిన ఈ మూవీ ఫస్ట్ సాంగ్ అనుకోని కారణాలతో ఆలస్యమైంది. ఆ పాటను ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతున్నట్టు నిన్న అనౌన్స్ చేశారు. మహేష్ బాబు, కీర్తి సురేష్‌ల మీద రొమాంటిక్‌గా తీసిన ఈ పాటకు తమన్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చాడని, మెలోడియస్ సాంగ్ ఆఫ్ ద ఇయర్‌గా ఇది నిలుస్తుందని నిర్మాతలు చెప్పారు. ఈ అప్‌డేట్‌తో మహేష్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా పరశురామ్ రూపొందిస్తున్న ఈ మూవీ మేజర్ పార్ట్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈలోపు మహేష్ మోకాలికి సర్జరీ జరగడం, ఆ తర్వాత కొవిడ్ సోకడం లాంటి కారణాలతో షూటింగ్‌కి బ్రేక్ పడింది. ప్యాండమిక్ పరిస్థితులు కుదురుకున్నాక నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 1న రిలీజ్ అని గతంలో ప్రకటించినప్పటికీ ఆ డేట్ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంత ఆలస్యమైనా ఈ ఏడాది సమ్మర్‌లోనే రిలీజ్ చేయనున్నారట. మహేష్ బాబుతో కలిసి నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.