తాగితేనే ఇలాంటి ఐడియాలు వచ్చేది : టమాటాలు ఇచ్చి మందు బాటిల్ అడిగాడు

తాగితేనే ఇలాంటి ఐడియాలు వచ్చేది : టమాటాలు ఇచ్చి మందు బాటిల్ అడిగాడు

అప్పుడెప్పుడో  వస్తు మార్పిడి పద్దతి ఉండేదని పుస్తకాల్లో చదువుకున్నాం.  అంటే మనకు ఏదైనా వస్తువు కొనాలన్నప్పుడు అంతే విలువైన మన దగ్గరఉన్న వస్తువులు ఇచ్చి ఆ వస్తువులు తెచ్చుకొనే విధానం ఉండేది. ఆ తరువాత డబ్బు అందుబాటులోకి వచ్చిన తరువాత  కరెన్సీతో కొనుక్కోవడం ప్రారంభించారు.  అయితే ఇప్పుడు కూడా కొన్ని మారు మూల ప్రాంతాల్లో వస్తు మార్పిడి పద్దతి  ఇప్పటికీ ఆచరణలో ఉందని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న వీడియో చూస్తే అర్దమవుతుంది.  

ఈ వీడియోలో  ఒక వ్యక్తి వైన్ షాప్‌లోకి టమాటాలను తీసుకువెళ్తాడు.మద్యం కోసం వాటిని మార్పిడి చేయాలని అడుగుతాడు.వైన్ షాప్ వ్యక్తి మొదట ఆశ్చర్యపోతాడు, కానీ టమాటాలకు ఉన్న డిమాండ్ పరిగణలోకి తీసుకొని మద్యం బాటిల్ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు.దాంతో సదరు కస్టమర్ సింపుల్ గా మద్యం( Liquor ) కోసం టమాటాలను మార్చుకుంటాడు. టమాటాలను మద్యం కోసం ఎక్స్ఛేంజ్ చేయడం   ప్రారంభించారు .ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఆరేడు టమాటాలు ఇస్తే లిక్కర్ బాటిల్ ఇవ్వడం కనిపించింది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక వ్యక్తి కొన్ని టమాటాల (Tomatoes)ను వైన్ షాప్ (Wine Shop) వద్దకు తీసుకెళ్లి మద్యం (Liquor) కావాలని అడిగాడు. టమాటాలు తీసుకుని మీకు మద్యం బాటిల్ ఇవ్వాలా  అని కౌంటర్‌లో ఉన్న వ్యక్తి ప్రశ్నించాడు. వినియోగదారుడు నవ్వుతూ అవును అని చెప్పాడు. కౌంటర్‌లోని వ్యక్తి టమోటాలకు బదులుగా మద్యం ఇవ్వడానికి అంగీకరించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ (Viral Video)గా మారింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manoj Singh (@mmanu262608)

 తర్వాత నవ్వుతూ వెళ్లిపోయినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. టమాటాలకు ఉన్న డిమాండ్ ఏంటో కళ్లకు కట్టినట్టు చూపించే ఈ వీడియో అప్‌లోడ్ అయిన కొంతసేపటికే సోషల్ మీడియాలో వైరల్( Social media ) అయింది, ఇప్పటివరకు దానిని మిలియన్ల మంది చూశారు. వీడియోపై కూడా చాలా ఫన్నీ కామెంట్లు వచ్చాయి.కొంతమంది టమాటాలు ఇప్పుడు భారతదేశంలో కొత్త కరెన్సీ అని చెప్పారు, మరికొందరు డాలర్‌కు పోటీగా టమాటాలను కొత్త కరెన్సీగా ప్రకటించాలని సరదాగా కామెంట్స్ చేశారు.ఇంకొందరు ఆర్బీఐ( RBI ) టమాటాలను నిల్వ చేసి కొత్త కరెన్సీని ముద్రించాలని చెప్పారు.

 టమాటాల సప్లయ్ తగ్గడంతో దేశవ్యాప్తంగా వాటి ధర పెరిగింది. ఒక దశలో కేజీ రూ.200 వరకు వెళ్లింది. ఇప్పుడిప్పుడే టమాటా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.