
- షెడ్యూల్ రిలీజ్ చేసిన ఎంసీసీ
హైదరాబాద్, వెలుగు: నీట్ యూజీ ఆల్ ఇండియా కోటా సెకండ్ రౌండ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) విడుదల చేసింది. సెప్టెంబర్ 4 నుంచి 12 వరకు సెకండ్ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించనుంది. ఈ రౌండ్‌లో సీటు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 19లోగా కాలేజీల్లో చేరాలి. థర్డ్ రౌండ్ కౌన్సెలింగ్ సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 వరకు జరగనుంది. ఇందులో సీటు సాధించిన వారు అక్టోబర్ 10లోగా కాలేజీల్లో చేరాలి. ఆల్ ఇండియా కోటాలో భర్తీకానీ సీట్ల కోసం అక్టోబర్ 14 నుంచి 18 వరకు స్ట్రే వేకెన్సీ రౌండ్ నిర్వహిస్తారు.
ఈ రౌండ్‌లో సీటు పొందిన విద్యార్థులు అక్టోబర్ 25లోగా తమకు కేటాయించిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. మరోవైపు, సుప్రీం తీర్పు నేపథ్యంలో వైద్య, విద్య ప్రవేశాలకు సంబంధించి స్టేట్ కోటా కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించేందుకు కాళోజీ వర్సిటీ సన్నాహాలు చేస్తున్నది. స్థానికతకు సంబంధించి సుప్రీంకోర్టు నాలుగు కేటగిరీలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపులు ఇవ్వడంతో.. హెల్త్ యూనివర్సిటీ ప్రభుత్వాన్ని స్పష్టత కోరింది.