షారుక్ ఖాన్ కుమారుడు అర్యాన్ కు వైద్య పరీక్షలు

షారుక్ ఖాన్ కుమారుడు అర్యాన్ కు వైద్య పరీక్షలు

ముంబయి: రేవ్ పార్టీ.. డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్‌ హీరో షారుక్‌ ఖాన్‌ కుమారుడు అర్యాన్ ఖాన్‌ను నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు కాసేపటి క్రితం జేజే హాస్పిటల్‌కు తరలించారు. క్రూయిజ్ షిప్ లో రేవ్ పార్టీ జరుగుతుండగా దాడి చేసి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఉదయం నుంచి అర్యాన్ ఖాన్‌ను తమ అదుపులో పెట్టుకుని విచారించిన డ్రగ్స్ ఎక్కడ నుంచి తెప్పించింది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. 

అర్యాన్ ఖాన్ తోపాటు మరో ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు ఎన్‌సీబీ అధికారులు మీడియాకు వెల్లడించారు. ఆర్యన్‌ ఖాన్‌ను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లామని.. వైద్య పరీక్షల తరవాత కోర్టుకు తీసుకెళ్ళే అవకాశమున్నట్లు సమాచారం.