హైదరాబాద్ లో ఆన్‌‌‌‌లైన్ గేమ్స్‌‌‌‌ కు బానిసై..బీటెక్‌‌‌‌ విద్యార్థి అదృశ్యం..

హైదరాబాద్ లో ఆన్‌‌‌‌లైన్ గేమ్స్‌‌‌‌ కు బానిసై..బీటెక్‌‌‌‌ విద్యార్థి అదృశ్యం..

గండిపేట, వెలుగు: ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ గేమ్స్‌‌‌‌కు అలవాటుపడి భారీగా డబ్బు ఖర్చు చేసిన ఓ బీటెక్‌‌‌‌ విద్యార్థి అదృశ్యమయ్యాడు. జేబీఐటీ కాలేజీలో బీటెక్‌‌‌‌ సెకండియర్​ చదువుతున్న యోగినంద(20) ఈ నెల 20న ఇంటి నుంచి నగదు తీసుకుని బైక్‌‌‌‌పై బయటకు వెళ్లి తిరిగి రాలేదు. యోగినంద కొంతకాలంగా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ గేమ్స్‌‌‌‌ ఆడుతున్నాడు. 

రెండేళ్ల క్రితం వాటి కోసం సుమారు రూ.6 లక్షలు ఖర్చు చేశాడు. నాలుగు నెలల క్రితం తల్లి జీతం డబ్బులు రూ.24 వేల తీసుకోగా తల్లిదండ్రులు మందలించారు. ఈ క్రమంలో ఈ నెల 20న సాయంత్రం 5.30 గంటలకు ఇంటి నుంచి మరో రూ.8 వేలు తీసుకుని బైక్‌‌‌‌పై బయటకు వెళ్లాడు. 

ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో రాజేంద్రనగర్‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.