హైటెక్స్లో మోదీ జీవితంపై ప్రదర్శన

 హైటెక్స్లో మోదీ జీవితంపై ప్రదర్శన

హైదరాబాద్,వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ జీవిత చరిత్ర, ఆలోచనపై హైదరాబాద్​ హైటెక్స్ లో ప్రదర్శన జరిగింది. ‘మేరా దేశ్ పహ్లే  అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ నరేంద్ర మోదీ’ పేరుతో మనోజ్ ముంతాషిర్ బృందంతో నృత్య  ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ బాల్యం నుంచి ఆపరేషన్ సిందూర్ వరకూ వివిధ ఘట్టాలను చూపించారు. 

ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్​ జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ గవర్నర్లు బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్​ రావు, ఎమ్మార్పీఎస్​నేత మంద కృష్ణ మాదిగ, దిల్ రాజు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, చంద్రశేఖర్ తివారి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మోదీ జీవిత చరిత్రపై జరిగిన ఈ ప్రదర్శన రాజకీయాలతో సంబంధం లేదన్నారు. మోదీ 24 ఏండ్లు సీఎంగా, ఆ తర్వాత ప్రధానిగా కొనసాగుతున్నారని తెలిపారు. ప్రతిరోజూ 18గంటల పాటు పనిచేస్తున్నారన్నారు.