శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో రైలు విస్తరణ

శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో రైలు విస్తరణ

హైదరాబాద్: మెట్రో రైలు రెండో దశ విస్తరణ పనులకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు దాదాపు 30 కిలోమీటర్ల మేర ఎక్స్ ప్రెస్ మెట్రో నిర్మించాలని గతంలోనే ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు మెట్రో మార్గం నిర్మాణం, నిర్వహణ కార్యకలాపాల కోసం హైదరాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో లిమిటెడ్ ను కూడా ఏర్పాటు చేసింది. ఈ ఎయిర్ పోర్టు మెట్రో లింక్ లో హైదరాబాద్ ఎయిర్ పోర్టు మెట్రోకు 51 శాతం, హెచ్ఎండీఏకి 49శాతం వాటాలుగా ప్రభుత్వం నిర్ణయించింది. 
ఈ మెట్రో ఎయిర్ పోర్టు లింకు ప్రాజెక్టులో జీఎంఆర్ గ్రూప్ 10 శాతం మేర అంటే దాదాపు రూ.519 కోట్లు పెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఎయిర్ పోర్టు ప్రయాణికుల కోసం నిర్మిస్తున్న ఎక్స్ ప్రెస్ మెట్రో కాబట్టి ప్రతి 5 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఏడు లేదా ఎనిమిది స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. గచ్చిబౌలి దగ్గర ఔటర్ రింగు రోడ్డు పక్కన సర్వీసు రోడ్డు నుంచి .. కొంత దూరం భూగర్భ మార్గంలోకూడా మెట్రో వెళుతుంది.