అసెంబ్లీలో బాలయ్యకు కౌంటరిచ్చిన మంత్రి రోజా..

అసెంబ్లీలో బాలయ్యకు కౌంటరిచ్చిన మంత్రి రోజా..

ఏపీ అసెంబ్లీలో మంత్రి రోజా జా కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ వేదికగా టీడీపీ ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలకు కౌంటర్‌ ఇచ్చారు మంత్రి ఆర్కే రోజా..  హిందూపురం  ఎమ్మెల్యే మొన్న తొడగొట్టి ఇవాళ తోకముడిచాడని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీఎమ్మెల్యేలకు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు,  నారాలోకేష్ కు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి రోజా సవాల్ విసిరారు.మా నాయకుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నాలుగున్నరేళ్లలో తీసుకొచ్చిన పథకాలు.. మీ నాయకుడు 14 ఏళ్లలో అమలు చేశారా? సవాల్‌ స్వీకరిస్తారా? దీనిపై చర్చకు సిద్ధమా? పసుపు జెండా పట్టుకునేవారైనా? ఎర్ర జెండా పట్టుకునేవారైనా ఈ ఛాలెంజ్‌ను స్వీకరిస్తారా ? అంటూ అసెంబ్లీ వేదికగా సవాల్‌ చేశారు మంత్రి ఆర్కే రోజా.  ప్రతిపక్ష నేత చంద్రబాబు‌ను చీట‌ర్‌‌గా అభివర్ణించారు. చంద్రబాబు చీటర్ అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజ‌మైన ప్రజా నాయ‌కుడ‌ని అన్నారు.

చంద్రబాబు ప్రతీ విషయంలో ఆడవాళ్లను మోసం చేశారు.. కానీ, నాలుగున్నరేళ్లగా ప్రతీ ఆడబిడ్డ కన్నీళ్లు తుడిచిన వ్యక్తం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అంటూ ప్రశంసలు కురిపించారు.. జగనన్న ఆలోచనలను కాపీ కొట్టి.. మినీ మేనిఫెస్టోను చంద్రబాబు రిలీజ్‌ చేశారని మండిపడ్డారు.. కసాయి వాడిని గొర్రెలు నమ్మొతాయేమో.. గానీ, చంద్రబాబును మాత్రం రాష్ట్ర ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు రోజా.. 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు తల్లులకు పంగనామాలు అనే పథకాన్ని అమలు చేసి.. నేడు తల్లులకు వందనం పథకం అమలు చేస్తామని చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇవన్నీ మాయమాటలు తెలుసన్నారు మంత్రి రోజా..