OMG : మంత్రి ఉత్తమ్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

OMG :  మంత్రి ఉత్తమ్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రమాదం తప్పింది. అధికారిక పర్యటనలో భాగంగా.. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరారు మంత్రి. హైదరాబాద్ నుంచి నేరుగా హుజూర్ నగర్ చేరుకోవాల్సి ఉండగా.. మార్గమధ్యంలోనే.. మంత్రి ఉత్తమ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అయ్యింది. 

హైదరాబాద్ నుంచి హుజూర్ నగర్ వెళుతుండగా.. వాతావరణంలో విపరీతమైన మార్పులు వచ్చాయి. గాలివానతోపాటు కారు మబ్బులు ఏర్పడటంతో విజిబులిటీ తక్కువ అయిపోయింది. దీంతో.. పైలైట్.. హెలికాప్టర్ ను కోదాడలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విషయం తెలిసిన వెంటనే స్థానిక అధికారులు, కాంగ్రెస్ నేతలు స్పాట్ కు చేరుకున్నారు.

కోదాడ నుంచి హుజూర్ నగర్ కు వాహనంలో బయలుదేరి వెళ్లారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హెలికాప్టర్ లో సాంకేతిక సమస్యలు, లోపం ఏమీ లేదని.. అనుకూలమైన వాతావరణం లేకపోవటం వల్లనే.. మధ్యలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు అధికారులు.
సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ మండలం మేళ్ల చెరువులో మంత్రి హెలికాప్టర్ ల్యాండ్ అవ్వాల్సి ఉంది. పలు అభివృద్ధి పనుల సమీక్ష లో భాగంగా హుజుర్ నగర్ పర్యటనకు వెళ్లిన మంత్రి.. వాతావరణ పరిస్తితుల కారణంగా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండ్ చేసి రోడ్డు మార్గంలో వెళ్లిపోయారు.