
నర్సంపేట, వెలుగు: తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కోరారు. గురువారం హైదరాబాద్‌లో మంత్రిని కలిసి నర్సంపేట నియోజకవర్గంలో రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల 4వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిందని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే వెంట నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, కాంగ్రెస్ కిసాన్ సెల్వరంగల్ జిల్లా అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్‌రావు పాల్గొన్నారు.