Viral Video : రన్నింగ్ ట్రైన్ కిటికీకి వేలాడుతున్న మొబైల్ దొంగ.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Viral Video : రన్నింగ్ ట్రైన్  కిటికీకి వేలాడుతున్న మొబైల్ దొంగ.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

 కదులుతున్న రైలులోని ప్రయాణికుడి మొబైల్‌ ఫోన్‌ చోరీ చేసేందుకు ఒక దొంగ ప్రయత్నించాడు.  అప్రమత్తమైన ప్రయాణికుడు ఆ దొంగ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. రైలులోని మరికొందరు కూడా ఆ వ్యక్తి చేతిని లోపలి నుంచి లాగి పట్టుకున్నారు. దీంతో కదులుతున్న రైలు నుంచి కిటికీ బయటకు ఆ దొంగ వేలాడాడు. (Thief Dangles Outside Train) ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

 బీహార్‌లోని భాగల్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. కదులుతున్న  రైలులోని ప్రయాణికుడి చేతిలో ఉన్న మొబైల్‌ ఫోన్‌ లాక్కునేందుకు బయట ఉన్న ఒక దొంగ ప్రయత్నించాడు. అయితే ఆ ప్రయాణికుడు దొంగ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ రైలులోని మరి కొందరు ప్రయాణికులు కూడా అతడికి సహకరించారు. అప్పుడు కదులుతున్న రైలు కిటికీ బయట ఆ దొంగ ప్రమాదకరంగా వేలాడాడు. రైలు కిటికీ నుంచి బయటకు ప్రమాదకరంగా వేలాడిన ఆ దొంగను చివరకు రక్షించారు. ఆ వ్యక్తులు దొంగ అనుచరులుగా భావిస్తున్నారు. 

వివరాల్లోకి వెళ్తే 

రైలు కిటికీ దగ్గర సీటులో కూర్చున్న ఓ మహిళ  సెల్ ఫోన్ లో మాట్లాడుతుంది. ఇంతలో ఓ యువకుడు ఆమె పైకి దూసుకెళ్లి ఫోన్ లాక్కొని పారిపోవాలని భావించాడు. అయితే ఆ యువకుడిని తోటి ప్రయాణీకులు పట్టుకున్నారు. దీంతో దొంగ ప్రయాణికుల బారి నుంచి తప్పించుకోలేకపోయిన దొంగ కదులుతున్న రైలు కిటికీకి వేలాడుతున్నాడు. ఆగ్రహించిన ప్రయాణికులు వెంటనే మొబైల్ దొంగ తలపై కొట్టారు. ఇలా కదులుతున్న రైలు కిటికీకి వేలాడుతూ.. సుమారు 500 మీటర్ల వరకు ప్రయాణించాడు.. ఆ సమయంలో బోగి లోపల ఉన్న ప్రయాణీకులు దొంగ తలపై నిరంతరం కొడుతూనే ఉన్నారు. అప్పుడు ఆ యువకుడు తనను కొట్టవద్దు.. కనికరించండి అంటూ వేడుకుంటున్నా ఎవరూ వినలేదు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.