సింగరేణి డైరెక్టర్గా మోకాళ్ల తిరుమలరావు బాధ్యతలు స్వీకరణ

సింగరేణి డైరెక్టర్గా  మోకాళ్ల తిరుమలరావు బాధ్యతలు స్వీకరణ

హైదరాబాద్​, వెలుగు: సింగరేణి నూతన డైరెక్టర్​గా మోకాళ్ల తిరుమలరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌‌‌‌లోని సింగరేణి భవన్‌‌‌‌లో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సంస్థ సీఎండీ ఎన్. బలరామ్‌‌‌‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎన్. బలరామ్ మాట్లాడుతూ.. సంస్థ ఉత్పత్తిని పెంచడంలో ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్(ఈఅండ్ఎం) విభాగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో సింగరేణి సోలార్, థర్మల్ ప్రాజెక్టులను విస్తరిస్తుందని.. ఈ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేయడంలో ఈఅండ్ఎం విభాగం ముఖ్య భూమిక పోషించాలన్నారు.  నూతన డైరెక్టర్​ తిరుమలరావు మాట్లాడుతూ.. తనను ఈ పదవికి ఎంపిక చేసిన రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.