రామగుండం ఎయిర్ పోర్టుకు సహకరించాలె:ఎంపీ గడ్డం వంశీకృష్ణ

రామగుండం ఎయిర్ పోర్టుకు సహకరించాలె:ఎంపీ గడ్డం వంశీకృష్ణ

ఢిల్లీ: రామగుండంలో ఎయిర్ పోర్ట్కు అందరు సహకరించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఇక్కడికి విమానాశ్రయం వస్తే పెద్దపల్లి, ఆదిలాబాద్ జిల్లాల ప్రజలకు మేలు జరుగుతుందన్నా రు. 

రామగుండంలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు కు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పిన ఆయన.. ఇందులో భాగంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడిని కలిసిన ఎయిర్ పోర్ట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై మరోసారి అధ్యయనం చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రూ. 50 లక్షలతో రీ ఫీజి బులిటి టెస్ట్కు డబ్బులు కట్టామన్నారు. తన విజ్ఞప్తి మేరకు ఈ నెల 3, 4 తేదీల్లో అధ్యయన బృందం రామగుండంలో పర్యటిస్తుందని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు.