
దాదాపు రెండు ఏళ్ళు, 734 ఆన్‌లైన్ ట్రాన్సక్షన్స్ స్కామ్‌లో ముంబైలోని 80 ఏళ్ల ఓ వృద్ధుడిని ప్రేమ, జాలి పేరుతో నలుగురు మహిళలు దాదాపు రూ.9 కోట్లు ముంచేశారు. అసలు విషయం ఏంటంటే ఏప్రిల్ 2023లో ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో షార్వి అనే మహిళకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. మొదట ఇద్దరికీ ఒకరినొకరు తెలియదు కాబట్టి ఫ్రెండ్ రిక్వెస్ట్ ఒకే చేయలేదు. కొన్ని రోజుల తర్వాత అతనికి షార్వి అకౌంట్ నుండే మళ్ళీ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది, దింతో అతను ఒకే చేసాడు.
తరువాత మెల్లిగా ఇద్దరూ చాటింగ్ స్టార్టింగ్ చేసి ఫోన్ నంబర్లు ఇచ్చుకున్నారు. ఈ చాటింగ్ ఫేస్‌బుక్ నుండి వాట్సాప్‌కు పాకింది. 80 ఏళ్ల ఈ వృద్దుడికి శార్వి తన భర్త నుండి విడిపోయి పిల్లలతో ఉంటున్నానని చెప్పింది. ఇలా ఆమె మాటలతో పిల్లల ఆరోగ్యం బాలేదు అంటూ డబ్బు అడగడం స్టార్ట్ చేసింది.
కొన్ని రోజుల తర్వాత, కవిత అనే మహిళ కూడా ఆ వ్యక్తికి వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపడం మొదలు పెట్టింది. ఆమె తాను షార్వికి తెలిసిన ఫ్రెండ్ అంటూ పరిచయం చేసుకుని అతనితో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నానని చెప్పింది. తరువాత ఆమె కూడా అతనికి అసభ్యకరమైన మెసేజులు పంపుతూ డబ్బు అడగడం చేసింది.
అదే ఏడాది డిసెంబర్‌లో ఆ వ్యక్తికి తాను షార్వి సోదరి దినాజ్ అంటూ మెసేజులు స్టార్ట్ అయ్యాయి. దినాజ్ ఆ వృద్ధుడికి షార్వి చనిపోయిందని ఆసుపత్రి బిల్లు కట్టాలని, దినాజ్ షార్వి ఆ వ్యక్తి మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌ను స్క్రీన్‌షాట్ పంపి డబ్బులు వసూలు చేసింది. చివరకు ఆ వ్యక్తి తన డబ్బు ఇవ్వమని అడిగినప్పుడు దినజ్ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది.
►ALSO READ | భారత్ అమెరికా మధ్య టారిఫ్స్ వార్.. సైలెంట్‌గా లాభం పొందుతున్న చైనా..!
ఆ వృద్ధుడి కష్టాలు అక్కడితో ఆగలేదు. వెంటనే జాస్మిన్ అనే మహిళ అతనికి మెసేజ్ చేయడం ప్రారంభించింది. ఆమె దినజ్ స్నేహితురాలినని చెప్పుకుంటూ సహాయం చేయమని అడిగింది. దింతో ఆ వృద్ధుడు ఆమెకు డబ్బు కూడా పంపాడు. ఇలా ఏప్రిల్ 2023 నుండి జనవరి 2025 వరకు 734 సార్లు డబ్బు పంపి మొత్తం రూ. 8.7 కోట్లు పోగొట్టుకున్నాడు.
ఉన్న డబ్బు అంతా అయిపోయిన తర్వాత కుడా అతని కోడలి నుండి రూ. 2 లక్షలు అప్పు తీసుకుని మరి డబ్బులు ఇచ్చాడు. ఇక్కడితో వాల్ల డిమాండ్లు ఆగలేదు, ఆ తర్వాత అతను తన కొడుకును రూ. 5 లక్షలు అడిగాడు. దింతో అనుమానం వచ్చిన కొడుకు తండ్రిని గట్టిగ అడిగాడు, అప్పుడు అసలు విషయం బయటికొచ్చింది. చివరికి తాను సైబర్ మోసంలో చిక్కుకున్నానని తెలుసుకొని ఆసుపత్రిలో చేరాడు. దీనిపై ఈ ఏడాది జూలై 22న సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.