భారత్ అమెరికా మధ్య టారిఫ్స్ వార్.. సైలెంట్‌గా లాభం పొందుతున్న చైనా..!

భారత్ అమెరికా మధ్య టారిఫ్స్ వార్.. సైలెంట్‌గా లాభం పొందుతున్న చైనా..!

అటు అమెరికా.. ఇటు ఇండియా రెండు దేశాలు టారిఫ్స్ గురించి మాట్లాడటానికి ముందుకు రావటం లేదు. రష్యా ఆయిల్ ఆపేది లేదని భారత్ తెగేసి చెప్పగా.. తమ మాట వినకపోతే బిజినెస్ డీల్ గురించి మాటలుండవని ట్రంప్ తేల్చి చెప్పేశారు. అగ్రదేశాల నాయకులు కొంచెం ఇగో పక్కన పెట్టి సమస్యకు పరిష్కారం వెతకాల్సిన సమయం వచ్చిందని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే అమెరికా ఇండియా కొట్లాటలు డ్రాగన్ చైనాకు లాభం చేకూరుస్తున్నాయని అంటున్నారు. 

50 శాతం సుంకాలకు తాము సిద్ధమేనని ప్రధాని మోదీ రెండు రోజుల కిందట చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా చిన్న వ్యాపారులకు వణుకు పుట్టిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో మోదీ వివేకంగా వ్యవహరించి ట్రంప్ ని తన దారికి తెచ్చుకోవటానికి ఇంకా మూడు వారాలు మాత్రమే గడువు ఉంది. అదనపు సుంకాలతో భారత్ 86 బిలియన్ డాలర్ల ఎగుమతులు ఎఫెక్ట్ కావటం పొరుగున ఉన్న చైనాకు సానుకూలంగా మారుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

►ALSO READ | FASTag News: ఆగస్టు 15లోపు ఫాస్ట్‌ట్యాగ్ ఏడాది పాస్ కావాలా..? కొనటానికి ఇదే సింపుల్ ప్రాసెస్..

చైనా కంటే భారత్ ప్రస్తుతం అధిక సుంకాలు కలిగి ఉండటంతో దానిని క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ని ప్రసన్నం చేసుకున్న యూరోపియన్ యూనియన్, యూకే, జపాన్ తక్కువ సుంకాలతో బయపడిన సంగతి తెలిసిందే. ఆఖరికి ట్రంప్ మాట విన్న పాకిస్థాన్ కూడా భారత్ కంటే తక్కువ సుంకాలు అందుకుంది. ట్రంప్ తన ఎన్నికల విజయానికి కారణం అయిన ఎలాన్ మస్క్ లాంటి వ్యక్తులనే విబేధాలు వస్తే పక్కన పెట్టేసిన సంగతి తెలిసిందే. అందుకే ట్రంప్ విషయంలో భారత్ అప్రమత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

చాలా మంది కొత్త సంస్కరణలకు దీనిని అవకాశం అంటుండగా భారత ప్రభుత్వం మాత్రం జాగ్రత్తగా ముందుకు సాగేందుకు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. భారత జీడీపీలో అమెరికాకు ఎగుమతుల విలువ 3 శాతం కంటే తక్కువగానే ఉండటం కొంత ఆందోళనకర అంశం. ప్రస్తుతం అమెరికా కొత్త పన్నుల పెంపుతో భారత ఎగుమతులు 0 శాతం నుంచి గరిష్ఠంగా 64 శాతం వరకు ప్రభావితం కానున్నాయి.