రివ్యూ: నారప్ప

రివ్యూ: నారప్ప

రన్ టైమ్ : 2 గంటల 29 నిమిషాలు
నటీనటులు: వెంకటేష్, ప్రియమణి ,కార్తీక్ రత్నం, రాజీవ్ కనకాల, రావు రమేష్, రాఖీ, శ్రీ తేజ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: శ్యాం కే నాయుడు 
సంగీతం: మణి శర్మ
నిర్మాతలు: సురేష్ బాబు, కలైపులి థాణు 
దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
రిలీజ్ డేట్: 20 జూలై 2021
కథేంటీ: నారప్ప (వెంకటేష్) అణగారిన కులానికి చెందిన పేద వ్యక్తి. తన ఫ్యామిలీ తో కలిసి ఊళ్లో ఉంటాడు.అదే ఊళ్లో ఉన్న పండుస్వామి (నరేన్) అనే పెత్తందారు నారప్ప కు చెందిన మూడెకరాల భూమిని లాక్కోవాలని చూస్తాడు. తనకు, తన కొడుకులకు అది ఇష్టం ఉండదు. ఈ రెండు కుటుంబాల మధ్య గొడవ. నారప్ప పెద్దకొడుకు (కార్తిక్ రత్నం) వాళ్లకు ఎదురు తిరుగుతాడు. ఒకట్రెండు సందర్భాల్లో వాళ్ల ను కొడతాడు.అది జీర్ణించుకోలేని వాళ్లు పెద్ద కొడుకు చంపేస్తారు.దానికి ప్రతీకారంగా చిన్న కొడుకు ఆ పండు స్వామిని చంపేస్తాడు.ఆ తర్వాత ప్రాణ భయంతో నారప్ప తన కుటుంబంతో కలిసి పారిపోతాడు.పండు స్వామి మనుషులకు వీళ్లు దొరికారా? తర్వాత జరిగిన పర్యవసనాలేంటి అనేది కథ.
నటీనటుల పర్ఫార్మెన్స్:
వెంకటేష్ మరోసారి సహజ నటనతో మెప్పించాడు. నారప్ప పాత్రలో జీవించాడు.ఎమోషనల్ సీన్లు,యాక్షన్ సీన్లలో అద్భుతమైన నటన కనబరిచాడు. సీనియర్ నారప్ప గెటప్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయిన వెంకీ, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మాత్రం యంగ్ నారప్ప పాత్ర సూట్ అవ్వలేదు. అయినప్పటికీ ఇలాంటి పాత్ర చేయడం అభినందనీయం. ప్రియమణి మంచి నటన కనబరిచింది. యంగ్ యాక్టర్ కార్తీక్ రత్నం ఆకట్టుకున్నాడు. ఉన్న కొద్దిసేపే అయిన ఇంపాక్ట్ చూపించాడు. సీనప్ప పాత్రలో నటించిన కుర్రాడు రాఖీ కూడా బాగా చేశాడు. రావు రమేష్, నరేన్, రాజీవ్ కనకాల, శ్రీతేజ్ తదితరులు తమ పాత్రల్లో ఒదిగిపాయారు.
టెక్నికల్ వర్క్: 
శ్యామ్ కె నాయుడు కెమెరా పనితనం బాగుంది.మణిశర్మ ఎప్పటిలాగే తన శైలిలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాకు ప్రాణం పోశాడు.పాటలు పర్వాలేదు. ఎడిటింగ్ బాగుంది.ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ వాల్యూయ్యూస్ అన్నీ బాగా సెట్ అయ్యాయి.
విశ్లేషణ:
‘‘నారప్ప’’ మూవీ ‘‘అసురన్’’ కు ఫెయిత్ ఫుల్ రీమేక్ అని చెప్పొచ్చు. అసురన్ లో ఉన్న సోల్ ను మిస్సవకుండా జాగ్రత్తపడ్డాడు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. కొన్ని సీన్లు సేమ్ టు సేమ్ లాగా అనిపించినా..అది పెద్ద కంప్లయింట్ గా అనిపించదు. అక్కడక్కడా కొన్ని మైనస్ లు ఉన్నా.. విక్టరీ వెంకటేష్ టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ వల్ల అవేవి కనిపించవు. ఆ బ్యాక్ డ్రాప్ ,నటీనటుల పర్ఫార్మెన్స్,మణి శర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లు ఈ సినిమాకు ప్రధాన బలాలుగా మారాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో కాస్త ల్యాగ్ ఉంది. ‘‘అసురన్’’ కంటే గొప్పగా తీయకపోయినా..చెడగొట్టలేదు డైరెక్టర్. అందుకే ‘నారప్ప’’ ఫర్వాలేదనిపిస్తాడు. ఒరిజినల్ చూసిన వాళ్లు వెంకటేష్ నటన కోసం ఒకసారి చూడొచ్చు. చూడనివాళ్లకు మాత్రం బాగా నచ్చుతుంది. థియేటర్లలో రిలీజై వుంటే ఇంపాక్ట్ బలంగా ఉండేది.