నారాయణగూడలో పోలీస్​ ఫ్లాగ్​ మార్చ్

నారాయణగూడలో పోలీస్​ ఫ్లాగ్​ మార్చ్

బషీర్ బాగ్, వెలుగు: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో సోమవారం నారాయణగూడ పోలీసులు కేంద్ర బలగాలతో కలిసి ఫ్లాగ్‌‌మార్చ్‌‌ నిర్వహించారు. లోకల్ పోలీసులతోపాటు దాదాపు వంద మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ధైర్యంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సుల్తాన్ బజార్ ఏసీపీ కె.శంకర్ సూచించారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నారాయణగూడ సీఐ చంద్రశేఖర్, డీఐ నాగార్జున, ఎసైలు జి.వెంకటేశ్, ఎం.శిరీష, జి.నరేశ్​కుమార్ పాల్గొన్నారు.