ఎమ్మెల్యే దానం నాగేందర్ హైదరాబాద్ నగర వాసులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. చైనా మాంజ పట్టిస్తే 5 వేలు గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు. చైనా మాంజ కారణంగా మనుషులతో పాటు పక్షులకు ప్రమాదాలు సంభవిస్తున్నాయని దానం అన్నారు.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎవరైన చైనా మాంజను విక్రయిస్తే ఉపేక్షించమని హెచ్చరించారు. ఏ షాపులో అయినా చైనా మాంజ అమ్ముతున్నట్లు సమాచారం ఇస్తే , విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేయిస్తామన్నారు.
సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని... వారికి తన నుండి 5 వేల నగదు బహుమతిగా ఇస్తానని దానం నాగేందర్ ప్రకటించారు. ముఖ్యంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో మాంజా అమ్ముతున్నట్లు తెలియజేస్తే నగదు బహుమతి ఇస్తామని సోమవారం (డిసెంబర్ 29) అన్నారు.
