NIRDPR ఉద్యోగ నోటిఫికేషన్.. అనుభవం ఉంటే చాలు.. అప్లయ్ చేసుకోవచ్చు..

NIRDPR ఉద్యోగ నోటిఫికేషన్.. అనుభవం ఉంటే చాలు.. అప్లయ్ చేసుకోవచ్చు..

హైదరాబాద్​లోని నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్​మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRDPR) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ బేస్డ్ పై నియమించనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. 

అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ అక్టోబర్ 03. 

పోస్టుల సంఖ్య: 05 (ప్రాజెక్ట్ సైంటిస్ట్స్  02, జూనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్స్ 03)

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎం.టెక్, ఎంఎస్సీలో ఉత్తీర్ణతోపాటు పని అనుభవం ఉండాలి .

వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 40 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.300.

లాస్ట్ డేట్: అక్టోబర్ 10.   

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు  career.nirdpr.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.