ప్రభుత్వ ఆఫీసుల్లో ఏసీలు 25 డిగ్రీల కంటే తగ్గించొద్దు! : నవీన్ మిట్టల్

ప్రభుత్వ ఆఫీసుల్లో ఏసీలు 25 డిగ్రీల కంటే తగ్గించొద్దు! : నవీన్ మిట్టల్
  • నవీన్ ​మిట్టల్ ​ఆదేశం

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్‌‌ను నియంత్రించడంతో పాటు పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎయిర్ కండీషనర్ల (ఏసీ) ఉష్ణోగ్రతను 25 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గించొద్దని స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

నెట్ జీరో అమలులో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ’ (బీఈఈ) మార్గదర్శకాలు, టీజీ రెడ్ కో వినతి మేరకు ఈ చర్యలు చేపట్టినట్టు ఆయన వివరించారు. అన్ని ప్రభుత్వ భవనాల్లోని ఏసీల సెట్టింగ్‌‌లు 25 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యతను ఉన్నతాధికారులకు అప్పగించారు.