ఆయిల్ పామ్ సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి : ప్రతాప్ సింగ్

ఆయిల్ పామ్ సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి :  ప్రతాప్ సింగ్
  • హార్టికల్చర్ ఆఫీసర్ ప్రతాప్ సింగ్

నిజాంపేట, వెలుగు : ఆయిల్ పామ్ సాగుకు రైతులు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ ప్రతాప్ సింగ్, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ దేవకుమార్ సూచించారు. బుధవారం మండల పరిధిలోని చల్మేడ గ్రామంలోని లీవ్ ఫామ్ రిసోర్స్ నర్సరీలో ఆయిల్ పామ్ విత్తనాల నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ జిల్లాలో నాలుగు లక్షల నాణ్యమైన మొక్కలను అందించడానికి టార్గెట్ పెట్టుకున్నామన్నారు. 

మొదటి విడతలో లక్ష మొలకెత్తిన విత్తనాలు నాటేందుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. అధిక నీటి వినియోగ పంటలకు బదులుగా, తక్కువ నీటితో పండే ఆయిల్ పామ్ సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో అగ్రికల్చర్ ఆఫీసర్లు రాజ్ నారాయణ, లింగారెడ్డి, హార్టికల్చర్ ఆఫీసర్ రచన, లీవ్ ఫామ్ కంపెనీ ప్రతినిధులు రంగనాయకులు, కృష్ణారావు, ప్రశాంత్, జాన్సన్ పాల్గొన్నారు.