- లేదంటే నాన్ బెయిలబుల్ వారెంట్!
బషీర్‌బాగ్, వెలుగు: జూబ్లీహిల్స్‌లోని దక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో దగ్గుబాటి కుటుంబం మరోసారి కోర్టులో హాజరుకాలేదు. తన హోటల్‌ను అక్రమంగా కూల్చివేశారని హోటల్ యజమాని నందు కుమార్ కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో దగ్గుబాటి సురేశ్, దగ్గుబాటి వెంకటేశ్, దగ్గుబాటి రానా గత ఐదు వాయిదాలలో నాంపల్లి కోర్టులో హాజరుకాలేదు. హాజరుకు మినహాయింపు ఇవ్వాలని హైకోర్టులో దగ్గుబాటి కుటుంబం తరఫు న్యాయవాదులు వేసిన క్వాష్ పిటిషన్‌ను న్యాయస్థానం శుక్రవారం తోసిపుచ్చింది.
ఈ నెల 23న తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. ఒకవేళ హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉంది. దీంతో ఈ నెల 23న తప్పనిసరిగా న్యాయస్థానం ముందు దగ్గుబాటి కుటుంబం హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
