డేంజరస్ స్టంట్ : మిస్ అయితే బాడీ పీస్ కూడా దొరకదురా..

డేంజరస్ స్టంట్ : మిస్ అయితే బాడీ పీస్ కూడా దొరకదురా..

సోషల్ మీడియా వచ్చాక కొందరు మరీ మితిమీరి ప్రవర్తిస్తున్నారు. కేవలం ఫాలోవర్లు, లైకులు, షేర్ ల కోసం పలు వీడియోలు తీసి ఎలాగైనా వైరల్ గా మారాలని ఆత్రుత పడుతున్నారు. అందుకోసం ఎలాంటి రిస్క్ చేయడానికి కూడా వెనకాడడం లేదు. అదే తరహాలో ఓ యువకుడు చేసిన డేంజరస్ స్టంట్ ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

ఈ వీడియోను ఓ ట్విట్టర్ యూజర్ పోస్ట్‌ చేశారు. దాంతో పాటు “వైరల్ వీడియో ఎక్కడిదో నాకు తెలియదు, కానీ ప్రజలు ఇలాంటి వీడియోలు చేస్తున్నారు, ఇది పూర్తిగా తప్పు, రైల్వే పోలీసులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి" అని క్యాప్షన్ గా రాసుకొచ్చిన యూజర్.. రైల్వే మంత్రి, అశ్విని వైష్ణవ్, రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌ను ట్యాగ్ చేశారు. ఈ నిర్లక్ష్యపు స్టంట్ వెనుక ఉన్న వ్యక్తిపై కొన్ని తీవ్రమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కూడా డిమాండ్ చేస్తున్నారు.

ALSO READ:Ollulleru: ప్రపంచాన్ని ఊపేస్తున్న మలయాళీ పాటకు 100 మిలియన్ వ్యూస్

ఈ వీడియోలో ఓ వ్యక్తి రైలు పట్టాల కింద భాగంలో పడుకుని ఉన్నాడు. అదే సమయంలో ట్రాక్ మీదు నుంచి రైలు అతి వేగంగా వెళ్తోంది. ఈ వీడియో పోస్ట్ చేసినప్పట్నుంచి దాదాపు 6లక్షలకు వ్యూస్ పొందగా.. ట్విట్టర్ యూజర్స్ తమ అభిప్రాయాలను కామెంట్స్ సెక్షన్ లో పోస్ట్ చేశారు. ఇది తప్పు, చాలా ప్రమాదకరమైనది అని ఒకరు రిప్లై ఇవ్వగా.. ఆ కుర్రాళ్ళు స్లీపర్‌ల నుంచి బ్యాలస్ట్/కంకరను తీసివేశారు, అక్కడికి వెళ్లడానికి స్థలాన్ని సృష్టించారు, ఇది రైల్వే ట్రాక్‌లపై ఒత్తిడిని కలిగిస్తుంది & రైళ్లు పట్టాలు తప్పడానికి కారణమవుతాయి. ఈ వ్యక్తి చేసిన పిచ్చి పనిని రైల్వే అధికారులు అత్యవసరంగా పరిశీలించాలని మరికొందరు విమర్శిస్తున్నారు. అయితే ఈ నిర్లక్ష్యపు స్టంట్ కేవలం సోషల్ మీడియా దృష్టిని, ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించడం కోసం మాత్రమే ప్రదర్శించబడిందని స్పష్టంగా తెలుస్తోంది.

https://twitter.com/NaredaAbhishek/status/1675012395436212225