Ollulleru: ప్రపంచాన్ని ఊపేస్తున్న మలయాళీ పాటకు 100 మిలియన్ వ్యూస్

Ollulleru: ప్రపంచాన్ని ఊపేస్తున్న మలయాళీ పాటకు 100 మిలియన్ వ్యూస్

"ఒల్లుల్లేరు ఒళ్లుల్లేరు మణినంకరే(Ollulleru Ollulleru maninankare)".. ఈ మలయాళీ పాట యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటనే వినబడుతోంది. ఒల్లుల్లేరు ఒళ్లుల్లేరు మణినంకరే.. అనేవి మలయాళం లో సాధారణంగా ఉపయోగించే వాడుక పాదాలు. వాటిని ఒక పాటలా సెట్ చేసి జనాలను ఉర్రూతలూగించారు ఈ సాంగ్ మేకర్స్.

ALSO READ:రియల్లీ గ్రేట్ కదా.. : పెట్రోల్ బంకు అమ్మాయి బొమ్మ గీసి ఇచ్చాడు..

ఈ పాట కేవలం ఇండియాలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. తాజాగా ఈ పాట రేర్ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. అదేంటంటే.. యూట్యూబ్‌లో 'ఒల్లుల్లేరు' పాట ఏకంగా 100 మిలియన్ వ్యూస్‌ను సాధించింది. గతేడాది విడుదలైన ఈ పాట.. ఆ సమయంలోనే యూట్యూబ్‌ను షేక్‌ చేసింది. 

Also Read :- ఓటీటీలో ఈవారం ఏకంగా 24 సినిమాలు..

ఈ మధ్య ఏ మలయాళ పాట సాధించని రికార్డ్ క్రియేట్ చేసింది ఒల్లుల్లేరు ఒళ్లుల్లేరు మణినంకరే పాట. ఈ పాటను జస్టిన్ వర్గీస్ స్వరపరచగా.. ప్రసీత చాలకుడి అనే సింగర్‌ పాడింది. అద్భుతమైన సంగీతం, అందమైన గాత్రం వెరసి ఈ పాటను ఆల్ టైం రికార్డ్ పొజిషన్ లో నిలబెట్టాయి. ఇక ఈ సాంగ్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి.. మేకర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.