వరుణ్ సందేశ్, ప్రియాంక జైన్ లీడ్ రోల్స్‌లో స్వాతి ప్రకాష్ డైరెక్ట్ చేసిన వెబ్ సిరీస్ ‘నయనం’. రేఖా నిరోషా, అలీ రెజా, ఉత్తేజ్ కీలక పాత్రలు పోషించారు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రజినీ తాళ్లూరి నిర్మించారు. జీ5లో డిసెంబర్ 19నుంచి స్ట్రీమింగ్ కానుంది.
మంగళవారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘సర్వేంద్రియాణాం.. నయనం ప్రమాదం’ అంటూ ట్రైలర్‌ను చూపించిన విధానం ఆసక్తిని పెంచింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ ‘ఈ కథ విన్నప్పుడు ఏం ఆలోచించకుండా ఎలాగైనా నయన్ క్యారెక్టర్ చేయాలని డిసైడ్ అయ్యా. వండర్‌ఫుల్ టీమ్‌తో వర్క్ చేశా.
చాలా రోజుల తర్వాత మంచి ప్రాజెక్ట్ చేశాననే సంతృప్తి కలిగింది’ అని అన్నాడు. ఈ ప్రాజెక్ట్ తనకెంతో స్పెషల్ అని, ఇందులో మాధవిగా తనను గొప్పగా చూపించారని ప్రియాంక జైన్ చెప్పింది. డైరెక్టర్ స్వాతి ప్రకాష్ మాట్లాడుతూ ‘పది మందిలో ఏడెనిమిది మంది పక్కవారి లైఫ్ ఎలా ఉందో తెలుసుకోవాలనే కుతూహలంతో ఉంటారు.
అలాంటి క్యూరియాసిటీ పీక్స్‌లో ఉంటే ఏం జరుగుతుందనేదే ఈ సిరీస్. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ పాయింట్‌ను నమ్మి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అని చెప్పారు. మంచి కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నామని నిర్మాత రజినీ తాళ్లూరి అన్నారు. నటులు అలీ రెజా, రేఖ నిరోషా, మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ, ఎడిటర్ వెంకట కృష్ణ, సినిమాటోగ్రాఫర్ షోయబ్ సిద్ధికీ, జీ5 టీమ్ పాల్గొన్నారు.

