టక్కర్..  కంప్లీట్ కమర్షియల్

టక్కర్..  కంప్లీట్ కమర్షియల్

సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ జంటగా  కార్తిక్ జి. క్రిష్ దర్శకత్వం వహించిన చిత్రం ‘టక్కర్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్ కలిసి నిర్మించాయి.  జూన్ 9న  తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌‌‌‌లో నిర్వహించిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో సిద్ధార్థ్​ మాట్లాడుతూ ‘కంప్లీట్ కమర్షియల్ సినిమా  చేయాలని నన్ను చాలా మంది అడుగుతుంటారు. వాళ్లందరికీ సమాధానమే ఈ చిత్రం. ఇప్పటివరకు లవర్ బాయ్‌‌‌‌గా చూసిన ప్రేక్షకులకు ఇందులో కొత్తగా కనిపిస్తాను. యాక్షన్ అండ్ రొమాంటిక్ టచ్‌‌‌‌తో ఈ లవ్ స్టోరీ ఉంటుంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని మరీ యాక్షన్ సీన్స్ చేశాను. ఇదొక యూనిక్ లవ్ స్టోరీ. ఈ జనరేషన్‌‌‌‌కి తప్పకుండా కనెక్ట్ అవుతుంది. ఆగస్టుకి హీరోగా 20 ఏళ్ల కెరీర్‌‌‌‌‌‌‌‌ను పూర్తి చేసినట్టు అవుతుంది. ఇప్పటికీ నా చేతిలో ఓ అరడజను సినిమాలు ఉండటం ఆనందాన్ని కలిగిస్తోంది’ అని అన్నాడు. ‘ఇదొక న్యూ జనరేషన్ సినిమా. సిద్ధార్థ్ రగ్గడ్ లుక్‌‌‌‌లో కనిపిస్తారు’ అని చెప్పాడు దర్శకుడు కార్తిక్.  సిద్దార్థ్​ కెరీర్‌‌‌‌‌‌‌‌లో మరో గుర్తుండిపోయే సినిమా అవుతుందన్నారు కో ప్రొడ్యూసర్ వివేక్ కూచిభొట్ల.