ఎన్సీపీ 'బాహుబలి' పోస్టర్.. వెన్నుపోటు పాత్రలో అజిత్ పవార్

ఎన్సీపీ 'బాహుబలి' పోస్టర్.. వెన్నుపోటు పాత్రలో అజిత్ పవార్

ప్రముఖ రాజకీయ నాయకుడు, శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)పై నియంత్రణను నిలుపుకోవడానికి పోరాడుతున్న సమయంలో.. అతని మద్దతుదారులు శరద్ పవార్ మేనల్లుడైన అజిత్ పవార్‌ను "ద్రోహి" అంటూ ట్యాగ్ చేస్తున్నారు. ప్రజలు అతన్ని క్షమించరని పోస్టర్ల ద్వారా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అజిత్ పవార్ చేసిన ఎత్తుగడ సాయంతో చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలను తన గుప్పిట్లో పెట్టుకున్నారు. జూలై 5న ముంబైలో జరిగిన సమావేశంలో శరద్ పవార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన అజిత్ పవార్ పై ఎన్సీపీ యువజన విభాగం ఢిల్లీలో పలు పోస్టర్లు వేసింది. ఈ పోస్టర్లలో అజిత్ పవార్ ను బాహుబలి సినిమాలో కట్టప్పతో పోలుస్తూ పోస్టర్ ను క్రియేట్ చేసింది.

నేషనలిస్ట్ స్టూడెంట్ కాంగ్రెస్ వేసిన ఈ పోస్టర్లలో ఒకదాంట్లో దేశద్రోహులను గురించి రాసుకొచ్చింది. దేశం మొత్తం తమలో దాగి ఉన్న ద్రోహులను చూస్తోంది. ఇలాంటి మోసగాళ్లను ప్రజలు క్షమించరు" అని బాహుబలి మూవీని పోలే పోస్టర్ ను అంటించింది. బాహుబలి సినిమాలో హీరోను కట్టప్ప వెన్నుపోటు సీన్ ను గుర్తు చేసే ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే శరద్ పవార్, అజిత్ పవార్‌లను పోలి ఉండేలా ఈ పోస్టర్ లో చూపించగా.. దీంటో ఎవరి పేరును మెన్షన్ చేయలేదు. "గద్దర్" -- అంటే దేశద్రోహి -- హ్యాష్‌ట్యాగ్‌తో మాత్రమే విషయాన్ని ప్రస్తావించింది.

https://twitter.com/ANI/status/1676798503702659073