బాబోయ్‌ ఇదేం ఆచారం.. . ఆ గ్రామంలో మహిళలు దుస్తులు ధరించడం నిషేధం, ఎందుకో తెలుసా!

బాబోయ్‌ ఇదేం ఆచారం.. . ఆ గ్రామంలో మహిళలు దుస్తులు ధరించడం నిషేధం, ఎందుకో తెలుసా!

హిమాచల్ ప్రదేశ్ లో ని ఓ గ్రామంలోని   ఒక వింత ఆచారం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే మహిళలు ఏకంగా ఐదు రోజులు దుస్తులు ధరించకుండా ఉంటారట. అదేంటి మహిళలు దుస్తులు వేసుకోకుండా ఉండటం ఏంటి.. ఇదెక్కడ ఆచారం అనుకుంటున్నారా. కానీ ఇది నిజమే.  వారు ఎందుకు అలా ఉండటానికి అసలు విషయం తెలుసుకుందాం. . . . 

ప్రాంతాలు, జిల్లాలు, రాష్ట్రాలు మారుతున్న కొద్దీ ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలు మారుతూ ఉంటాయి. అయితే ఈ ఆచారాలు కొన్ని వింతగా, ఆశ్చర్యంగా అనిపిస్తాయి కూడా. కట్టుబాట్లు ప్రతి ప్రాంతంలోనూ ఉన్నా.. కొందరు మాత్రమే వాటిని ఇప్పటికీ తూచా తప్పకుండా పాటిస్తుంటారు. నగరాలతో పోలిస్తే గ్రామస్థులు ఆచార వ్యవహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి ఓ గ్రామం గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోయేది. ఈ గ్రామంలో ఓ వింత ఆచారాన్ని స్థానికులు పాటిస్తున్నారు. 

వింత గ్రామం  భారత్ లోనే

మనం ఇప్పుడు చెప్పుకోబోయే వింత గ్రామం మరెక్కడో, ఆఫ్రికా దేశంలోనో లేదు. ఇక్కడే మన భారత్ లోనే హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. హిమాచల్ ప్రదేశ్ లోని మణికర్ణ లోయలో ఉంటుంది పిని అనే గ్రామం. ఇక్కడ శతాబ్దాల నాటి ఆచారాన్ని ఇప్పటికీ తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఈ గ్రామంలో మహిళలు పూర్తిగా దుస్తులు లేకుండానే ఉంటారు. ఒంటిపై నూలు పోగు కూడా ఉండదు.మహిళలు దుస్తులు లేకుండా ఉండే ఈ ఆచారాన్ని పిని గ్రామస్థులు ఏడాదంతా పాటించరు.

ఈ ఆచారం ఇప్పటిది కాదు

సంవత్సరంలో 5 రోజుల పాటు ఒంటిపై బట్టలు లేకుండా ఉంటారు మహిళలు. అయితే ఈ ఐదు రోజుల పాటు బట్టలు లేకుండానే తిరుగుతారా.. అనే ప్రశ్న మీకు వచ్చే ఉంటుంది. 5 రోజుల పాటు బట్టలు లేకుండా ఉండే మహిళలు ఇల్లు వదిలి బయటకు రారు. ఇంటి పట్టునే ఉంటారు.  అలాగే ఈ ఐదు రోజుల పాటు ఇతరులు ఎవరూ ఈ గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు. బయటి వ్యక్తులు ఎవరూ రాకుండా అడ్డుకుంటారు. శతాబ్దాల నాటి ఈ ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు పిని గ్రామస్థులు.అలా కాకుండా ఆ ఆచారాన్ని ఉల్లంఘిస్తే కీడు జరుగుతుంది అని అక్కడి ప్రాంత ప్రజల నమ్మకం. అయితే ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలలో వైరల్ అవ్వటంతో.. ఇదెక్కడి వింత ఆచారం అంటూ.. సమాజం అన్ని విషయాలలో ముందుకు పోతుంది కానీ.. ఇటువంటి విషయంలో మాత్రం ఇంకా వెనుక బడే ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు

ఈ ఆచారం వెనక ఉన్న చరిత్ర ఏంటి?

ఈ ఆచారాన్ని పాటించడం వెనక ఓ కథను చెబుతున్నారు పిని గ్రామస్థులు. శతాబ్దాల క్రితం తమ గ్రామాన్ని దెయ్యాలు ఆక్రమించాయట. గ్రామంలోని వివాహిత స్త్రీలకు అందమైన దుస్తులు ధరింపజేసి రాక్షసులు వారితో పాటు తీసుకు వెళ్లారట. అప్పుడు లహువా ఘోండ్ అనే దేవత ప్రత్యక్షమై ఆ రాక్షసులను ఓడించి మహిళలను విడిపించిందట. అప్పటి నుంచి మహిళలు అందమైన దుస్తులు ధరిస్తే రాక్షసులు వస్తారని, అందుకే సంవత్సరంలో 5 రోజులు మహిళలు బట్టలు లేకుండా ఉంటారని అక్కడి గ్రామ పెద్దలు చెబుతున్నారు. 

అలా కాకుండా ఆ ఆచారాన్ని ఉల్లంఘిస్తే కీడు జరుగుతుంది అని అక్కడి ప్రాంత ప్రజల నమ్మకం. అయితే ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలలో వైరల్ అవ్వటంతో.. ఇదెక్కడి వింత ఆచారం అంటూ.. సమాజం అన్ని విషయాలలో ముందుకు పోతుంది కానీ.. ఇటువంటి విషయంలో మాత్రం ఇంకా వెనుక బడే ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

సమాజం అన్ని విషయాలలో ముందుకు పోతూనే ఉంది. కానీ కొన్ని వింత ఆచారాల విషయంలో మాత్రం వెనుకబడే ఉంది. ఇప్పటికే పలుచోట్ల ఎన్నో వింత వింత ఆచారాలు చూస్తున్నాం. ఆ ఆచారాలు పాటించిన వాళ్ళని చూస్తే మరింత ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండటంతో.. కొన్ని కొన్ని ప్రాంతంలో జరుగుతున్న వింత ఆచారాలు నేరుగా సోషల్ మీడియా ద్వారా బయటపడుతున్నాయి.