పటేల్ అచంచలమైన స్ఫూర్తిృ, దూరదృష్టి.. ఎప్పటికీ మార్గదర్శకమే : మోదీ

పటేల్ అచంచలమైన స్ఫూర్తిృ, దూరదృష్టి.. ఎప్పటికీ మార్గదర్శకమే : మోదీ

సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ దార్శనికతతో కూడిన రాజనీతిజ్ఞతను, దేశానికి ఆయన చేసిన సేవలను, అసాధారణ అంకితభావాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. పటేల్ కు నివాళులర్పించారు. "సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా, మేము అతని అచంచలమైన స్ఫూర్తిని, దూరదృష్టితో కూడిన రాజనీతిజ్ఞతను, మన దేశ విధిని రూపొందించిన అసాధారణ అంకితభావాన్ని గుర్తుచేసుకుంటున్నాం" అని ప్రధాని Xలో రాసుకొచ్చారు.

“జాతీయ సమైక్యత పట్ల ఆయన నిబద్ధత మాకు మార్గదర్శకంగా కొనసాగుతోంది. ఆయన సేవకు మేం ఎప్పటికీ రుణపడి ఉంటాం' అని మోదీ తెలిపారు. 1875లో గుజరాత్‌లో జన్మించిన పటేల్ ఒక న్యాయవాది. స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీకి సహచరుడిగా, ప్రముఖ కాంగ్రెస్ నాయకుడిగా ఎదిగారు. స్వతంత్ర భారతదేశంలో మొదటి హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన..  వందలాది రాచరిక రాష్ట్రాలను యూనియన్‌లోకి చేర్చిన ఘనతను దక్కించుకున్నారు.