నర్సాపూర్, వెలుగు: పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం నర్సాపూర్ పీఎస్లో సీఐ జాన్ రెడ్డి ఆధ్వర్యంలో ఓపెన్ హౌజ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ ఆయుధాల వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. శాంతి భద్రతల విషయంలో పోలీసులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
తూప్రాన్: విద్యార్థులు చదువుతోపాటు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని డీఎస్పీ నరేందర్ గౌడ్ అన్నారు. తూప్రాన్ పీఎస్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రజల కోసం సరిహద్దులో సైనికులు, రాష్ట్రంలో పోలీసులు పనిచేస్తున్నారన్నారు. అనంతరం విద్యార్థులకు పోలీసుల ఆయుధాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీఐ రంగ కృష్ణ, ఎస్ఐలు శివానందం, యాదగిరి, జ్యోతి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
