
ఫైజల్, రిజిత జంటగా రాజేష్ నెల్లూరు దర్శకత్వంలో షేక్ అల్లాబకాషు నిర్మించిన చిత్రం ‘కావేరి’. రీసెంట్‌గా ఈ చిత్రం విడుదలైంది. సినిమాకొస్తున్న రెస్పాన్స్ తెలియజేసేందుకు ఆదివారం టీమ్ ప్రెస్‌మీట్ నిర్వహించింది.
హీరో ఫైజల్ మాట్లాడుతూ ‘సినిమాకి మంచి స్పందన లభిస్తోంది.థియేటర్ నుంచి ఎమోషనల్‌గా బయటకు వచ్చామని మెసేజ్‌లు చేశారు. ఇందులో మేము అనుకున్న థ్రిల్లింగ్ ఎలిమెంట్ బాగా వర్కౌట్ అయింది. అన్ని చోట్ల నుంచి వస్తున్న పాజిటివ్ ఫీడ్ బ్యాక్ చూసి సంతోషంగా ఉంది’ అని అన్నాడు.
తక్కువ బడ్జెట్‌లో కూడా మంచి సినిమా చేయగలమని నిరూపించిన చిత్రమిది అని దర్శకుడు రాజేష్ చెప్పాడు.క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రతి ఒక్కరూ బాగుందని ప్రశంసించడం ఆనందంగా ఉందని నిర్మాత అన్నారు.