శ్రీకృష్ణుడిగా నారసింహుడు..యాదగిరి గుట్టలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

శ్రీకృష్ణుడిగా నారసింహుడు..యాదగిరి గుట్టలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట: శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ ఐదో రోజు ఉదయం స్వామివారి శ్రీకృష్ణావతార అలంకార సేవను ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యుల అర్చకత్వంలో అర్చకులు. యజ్ఞాచార్యులు, పారాయణికులు కన్నుల పండువగా నిర్వహించారు. శ్రీకృష్ణుడిగా భక్తులను కనువిందు చేసిన నారసింహుడు... ఆలయ మాడవీధుల్లో విహరించి తన్మయపర్చారు.

 ప్రధానాలయంలో స్వామివారికి నిత్య ఆరాధనలు ముగిసిన అనంతరం ము రళీకృష్ణ అలంకారంలో ఆలయ తిరువీధు ల్లో ఊరేగించారు. ప్రత్యేకంగా తెప్పించిన పూలతో శ్రీకృష్ణ అలంకారంలో స్వామి వారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. వజ్ర వైఢూర్యాలు ధరించి, మురళీని చేతబూని వేణుగానం ఆలపిస్తున్నట్లుగా స్వామివారిని చూడముచ్చటగా అలంకరిం చారు. యజ్ఞాచార్యుల వేదపఠనాలు, పారాయణికుల వేదపారాయణాలు, రుత్వికుల మూర్తిమంత్ర, మూలమంత్ర జపాల మధ్య శ్రీకృష్ణ అలంకార సేవను వైభవోపేతంగా నిర్వహించారు.