హోటల్ కాఫీ మేకర్‌లో ఇదేం పని?.. ఇంటర్నెట్ లో వీడియో కలకలం.. నెటిజన్లు ఆగ్రహం

హోటల్ కాఫీ మేకర్‌లో ఇదేం పని?.. ఇంటర్నెట్ లో వీడియో కలకలం.. నెటిజన్లు ఆగ్రహం

కాఫీ మేకర్ కాఫీ కలిపేందుకు వాడతారు.ఇది మనందరికి తెలుసు. అయితే ఓ ట్రావెల్ ఇన్ ఫ్ల్యూయెన్స్రర్ హోటల్ రూంలో కాఫీ మేకర్ వినియోంచిన తీరు కలకలం రేపింది. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లలో తీవ్ర ఆగ్రహం తెప్పించింది. హోటల్ రూంలలో పరిశుభ్రతపై నెట్టింట చర్చ కు దారితీసింది. 

సోషల్ మీడియా ప్లాట్ ఫాం Xలో  @HustleBitch_ అకౌంట్ లో టిక్ టాక్ ఈ వీడియోను పోస్ట్ చేసింది. హోటల్ గదిలో కాఫీ మేకర్  మెషీన్ లో అండర్ వేర్ వేసి ఉతుకుతున్న వీడియోను షేర్ చేసింది. ట్రావెల్ హ్యాక్ అని క్యాప్షన్ ఇచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో  ఇది  అత్యుత్తమమైన మార్గం అంటూ పోస్ట్ చేసింది. 

వీడియోల కాఫీ మేకర్ పక్కన నిలబడి ఏవిధంగా ఆ మిషన్ లో అడర్  వేర్ శుభ్రం చేయొచ్చు అనే విషయాన్ని  వివరిస్తోంది. ప్రతి హోటల్ గదిలో ఓ కాఫీ మేకర్  ఉంటుంది.  అది కేవలం కాఫీ మేకరే కాదు.. మినీ వాషింగ్ మిషన్ లా కూడా వాడొచ్చని చెబుతోంది. దశల వారీగా  మెషిన్ ను వినియోగించే విధానాన్ని తెలిపింది. 

కాఫీ మేకర్ మిషన్ లో కాఫీ గ్రౌండ్ లకు వినియోగించే కంపార్టుమెంట్ లో అండర్ వేర్  ఉంచి మూత పెట్టి బ్రూ బటన్ ను నొక్కాలి.. మెషీన్ లోని వేడినీరు అండర్ వేర్లను శుభ్రం చేస్తుంది. ఆ తర్వాత ఆరబెట్టేందుకు హెయిర్ డ్రయర్ లను వినియోగించాలని ఏదో కొత్త విషయాన్ని కనిపెట్టిన ఫీలింగ్ తో చెబుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. 

టిక్ టాక్ ఇన్ ఫ్లూయెన్సర్ పై నెటిజన్ల ఆగ్రహం.. 

సోషల్ మీడియాలో ఈ వీడియో షేర్ చేసిన క్షణాల్లోనే బాగా వైరల్ అయింది. అయితే  నెటిజన్లు ఈ షేర్డ్ మెషీన్ ను ఇలా ఉపయోగించాలనే ఆలోచనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటళ్లలో బస చేసేవారు ఓసారి చెక్ చేసుకోవాలని సూచించారు. కొందరైతే హ్యక్ అపరిశుభ్రతపై, హోటల్ యాజమాన్య గెస్ట్ ల పట్ల నిర్లక్ష్యం అని విమర్శించారు. హోటల్ కాఫీ మేకర్లను ఎప్పుడూ శుభ్రం చేయరు..ఇది బ్యాక్టీరియా వ్యాప్తికి  దారితీస్తుందని  ఆందోళన వ్యక్తం చేశారు.  

కాఫీ మేకర్ లాంటి మెషీన్లను దుర్వినియోగం చేస్తే బ్యాక్టీరియా , శరీర ద్రవాలు వాటి ఉపరితలాన్ని కలుషితం చేస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలు ఉండి కూడా శానిటైజేషన్  జరగదు. ఇలాంటి మెషీన్లను శుభ్రం చేయకపోతే అనారోగ్యం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఏదీ ఏమైనా పబ్లిక్ వినియోగించే హోటల్స్ ఇలాంటి   దరిద్రమైన పనులేంటని ఇంకొదరు అసహ్యించుకుంటున్నారు.