
- ఇంజనీర్లకు పదోన్నతులపై హర్షం
హైదరాబాద్, వెలుగు: ఇంజనీర్లకు ప్రమోషన్లు కల్పించి పోస్టింగ్‌లు జారీ చేయడంపై పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపింది. పవర్‌ఇంజనీర్స్ అసోసియేషన్అధ్యక్షుడు రత్నాకర్‌రావు, ప్రధానకార్యదర్శి పి. సదానందం ఆధ్వర్యంలో ప్రతినిధులు ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు మాట్లాడుతూ.. గత 15 ఏండ్లలో ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో 209మందికి ప్రమోషన్లు కల్పించడం ఇదే మొదటిసారని వారు చెప్పారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ జాతికి అంకితం చేసే కార్యక్రమానికి అనుగుణంగా ఈ పదోన్నతులు కల్పించినట్టు పేర్కొన్నారు. ముందస్తు ప్రణాళికలతో డిమాండ్ కు అనుగుణంగా యాసంగి సీజన్‌లో గరిష్ఠంగా 17,162 మెగావాట్లను విజయవంతంగా సరఫరా చేశామని వివరించారు.