ఎంతో హార్డ్ వర్క్ చేస్తే గుజరాత్ అభివృద్ధి చెందింది: ప్రధాని మోడీ

ఎంతో హార్డ్ వర్క్ చేస్తే  గుజరాత్ అభివృద్ధి చెందింది: ప్రధాని మోడీ

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ .. ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచుతోంది. తాజాగా ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మెహసానాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ...20 ఏళ్లలో గుజరాత్ ఎంతో మార్పు చెందిందని అన్నారు. ఇప్పటి జనరేషన్కు గతంలో గుజరాత్ ఎన్ని కష్టాలు పడ్డది తెలియదన్నారు. ఎన్నో ఏళ్లు.. ఎంతో హార్డ్ వర్క్ చేస్తే.. గుజరాత్ అభివృద్ధి చెందిందని చెప్పారు.  

డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి..

అంతకుముందు ప్రధాని మోడీ ద్వారకలో పర్యటించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ద్వారక బీజేపీ అభ్యర్థి పబుబా మానెక్ లతో కలిసి ద్వారక శ్రీకృష్ణుడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే గుజరాత్ అభివృద్ధి సాధ్యమన్నారు.

గుజరాత్లో 15 లక్షల ఇండ్ల నిర్మాణం..

ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా మూడు కోట్లకు పైగా పక్కా ఇళ్లను నిర్మించారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. పీఎం ఆవాస్ యోజన కింద గుజరాత్ రాష్ట్రంలో 15లక్షల ఇళ్లు నిర్మించామని చెప్పారు. గుజరాత్ బొటాడ్లో ప్రచారంలో పాల్గొన్న నడ్డా... పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద గుజరాత్లో 66లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతోందని పేర్కొన్నారు.