స్టూడెంట్‌‌ను బిల్డింగ్ పైనుంచి వేలాడదీసిండు

స్టూడెంట్‌‌ను బిల్డింగ్ పైనుంచి వేలాడదీసిండు
  • ఉత్తరప్రదేశ్​లో హెడ్మాస్టర్ అరెస్టు

న్యూఢిల్లీ: తోటి స్టూడెంట్​ను కొరికిండనే కారణంతో మరో స్టూడెంట్​ను బిల్డింగ్ పైనుంచి వేలాడదీసిండో హెడ్మాస్టర్. ఈ ఘటన ఉత్తరప్రదేశ్​లోని మీర్జాపూర్ లో గురువారం జరిగింది. ఇక్కడి స్కూల్​లో రెండో తరగతి చదువుతున్న సోనూ యాదవ్.. లంచ్ బ్రేక్ టైమ్​లో బయట ఆటలాడుకుంటుండగా తోటి స్టూడెంట్​ను కొరికాడు. దీంతో కోపానికి వచ్చిన హెడ్మాస్టర్ మనోజ్ విశ్వకర్మ... సోనూ యాదవ్​ను బిల్డింగ్ పైకి తీసుకెళ్లి, కాళ్లు పట్టుకొని తలకిందులుగా వేలాడదీశాడు.

సారీ చెప్పకపోతే కిందికి వదిలేస్తానని బెదిరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద హెడ్మాస్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే హెడ్మాస్టర్ చేసింది తప్పేనని, కానీ ఆయన ప్రేమతోనే అలా చేశారని బాలుడి తండ్రి రంజిత్ యాదవ్ అన్నారు. ‘‘సోను అల్లరి పిలగాడు. తోటి స్టూడెంట్లతో పాటు టీచర్లను కూడా కొరుకుతడు. అతనికి తగిన బుద్ధి చెప్పాలని ఆయన తండ్రే చెప్పాడు. అందుకే సోనూను భయపెట్టే ప్రయత్నం చేశాను” అని హెడ్మాస్టర్ చెప్పారు.