మీరు Gen Z(జనరేషన్ Z)కి చెందిన వారితో కొద్దిసేపు మాట్లాడితే వెంటనే ఒక విషయం గమనించొచ్చు. వారు వాళ్ళ ముందున్న తరాల కంటే చాలా ఈజీగా, స్పష్టంగా భావోద్వేగాల భాషను ఉపయోగిస్తారు. గతంలో మిలీనియల్స్(జనరేషన్ Y) వంటి వారు టెన్షన్ లేదా అతిగా ఆలోచించడం వంటి విషయాలను Gen Z ఏమాత్రం మొహమాటపడకుండా అసౌకర్యాన్ని సూచించే పదాలను ఉపయోగిస్తారు. బర్న్అవుట్ (Burnout), యాంగ్జైటీ (Anxiety), OCD వంటివి.
కొందరు దీన్ని అతి(overdramatic) అంటారు. కానీ మానసిక నిపుణులు మాత్రం వాళ్ళు చివరకు మౌనాన్ని ఛేదిస్తున్నారు అని చెబుతున్నారు. ఈ విషయంపై కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ నిష్ఠ జైన్ వంటి నిపుణులు కూడా అభిప్రాయాన్నీ షేర్ చేసుకున్నారు. ఈ తరం మానసిక ఆరోగ్యం గురించి మనం మాట్లాడే విధానాన్ని పూర్తిగా మార్చేసిందనేది నిజం అని అన్నారు.
ఫీలింగ్స్‌ని గుర్తించడం వారి బలం (Emotional literacy ):
జనరేషన్ జెడ్ (Gen Z) వాళ్ళ ఫీలింగ్స్‌ని చెప్పడానికి భయపడరు. నిజంగా వాళ్ళు అందులో బెస్ట్.వాళ్ళు థెరపీ గురించి, మెంటల్ హెల్త్ గురించి మాట్లాడే వాళ్ళ కంటెంట్‌ని, బహిరంగ చర్చలని చూస్తూ పెరిగారు. అందుకే వాళ్ళ తల్లిదండ్రుల తరంతో పోలిస్తే వీళ్ళకి సిగ్గు తక్కువ. అందుకే, పెద్దవాళ్ళు మామూలుగా 'సిగ్గు' అని తీసిపారేసే దాన్ని, వీళ్ళు ధైర్యంగా 'సామాజిక ఆందోళన' (Social Anxiety) అని పేరు పెట్టి పిలుస్తారు.
పాత తరం వారు సిగ్గుపడుతున్నారు అని చెప్పేవాళ్ళు, కానీ దాన్ని వీళ్ళు ధైర్యంగా సామాజిక ఆందోళన (Social Anxiety) అని పిలుస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ గురించి ఎంత తెలుసో చూపిస్తుంది. అందుకే వాళ్ళు లోపల బాధ పడకుండా, సహాయం అడగడానికి ఎక్కువ ధైర్యం చేస్తారు.
క్లారిటీ అవసరం:
ఎక్కువ పదజాలం ఉంటే ఎక్కువ వివరణ ఉంటుంది, కానీ కొన్నిసార్లు తప్పుగా అర్ధం చూపించే ప్రమాదం కూడా ఉంది. ప్రతి బ్యాడ్ డే నిరాశ (Depression) కాదు. ప్రతి భయం ఆందోళన (Anxiety) కాదు. సాధారణ ఒత్తిడి మొత్తం బర్న్అవుట్ కాదు. మానసిక నిపుణులు ఏమంటున్నారంటే, ప్రతొలిరోజు అసౌకర్యాన్ని కూడా క్లినికల్ పదాలుగా మార్చే ట్రెండ్ పెరుగుతోంది. ఇది వాళ్ళ భావాలను తక్కువ చేయనప్పటికీ, మనం సొంత అవగాహనను ఖచ్చితం చేయాలని గుర్తుచేస్తుంది.
సోషల్ మీడియా ప్రభావం:
Gen Z కంటిన్యూగా ఇన్‌పుట్ ఓవర్‌లోడ్ స్థితిలో జీవిస్తున్నారు. నోటిఫికేషన్‌లు, రీల్స్, మెసేజ్‌లు, పక్కాగా చూపించే జీవితాలు (Curated Perfection).
ఎప్పటికప్పుడు పోల్చుకోవడం:
అతిగా ప్రేరేపించడం వల్ల వారి భావోద్వేగాలు పెద్దవిగా, వేగంగా, ప్రాసెస్ చేయడం కష్టంగా మారుతున్నాయి. ఒకేసారి సక్సెస్ కావాలనే, అందరినీ మెప్పించాలనే ఒత్తిడి పెరుగుతోంది. అందుకే వాళ్ళ లోపల ఉన్న ప్రపంచాన్ని వివరించడానికి వారు మానసిక ఆరోగ్య పదజాలంపై ఎక్కువగా ఆధారపడుతున్నారు.
అందరికీ సురక్షితమైన ప్రదేశం సృష్టిస్తారు:
Gen Z తీసుకువచ్చిన ఒక పవర్ ఫుల్ మార్పులలో ఒకటి భావోద్వేగ పోరాటాల చుట్టూ సురక్షితమైన ప్రదేశం(Safe Spaces) సృష్టించడం. వాళ్ళు వాళ్ళ భావాలకు పేరు పెట్టడానికి క్షమాపణ చెప్పకపోవడం వల్ల పాత తరాలు కూడా మనసు విప్పడం ప్రారంభించాయి. అంటే ఒకప్పుడు దాని గురించి మాట్లాడకు అని ఉండేది ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం అనేల మారింది.
Gen Z అడుగుపెట్టక ముందు:
ఈ ఓపెన్ నెస్(openness) చిన్న పట్టణాలు, సంప్రదాయ కుటుంబాలు, ఆఫీసులు, స్కూళ్లలోకి కూడా వ్యాపించిందని, జనరేషన్ Z అడుగుపెట్టక ముందు భావోద్వేగ పదజాలం అస్సలు లేదని థెరపిస్టులు అంటున్నారు. Gen Z వాళ్ళు ఎలా భావిస్తున్నారో మార్చడం మాత్రమే కాదు, మనమందరం మానసిక ఆరోగ్యాన్ని అర్థం చేసుకునే విధానాన్ని కూడా వాళ్ళు మారుస్తున్నారు.
