పీవీఆర్ హైస్కూల్ శతాబ్ధి ఉత్సవాల ప్రీమీట్

పీవీఆర్ హైస్కూల్ శతాబ్ధి ఉత్సవాల ప్రీమీట్

హైదరాబాద్​సిటీ, వెలుగు: నగరంలో ఒంగోలుకు చెందిన పీవీఆర్‌‌ మున్సిపల్ హైస్కూల్ శతాబ్ది ఉత్సవాల ప్రీ-మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కన్వీనర్​ఆరిగ వీర ప్రతాప్, కో కన్వీనర్ శ్రీ బేతంశెట్టి హరిబాబు మాట్లాడుతూ.. ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఈ ప్రీమీట్​లో పూర్వ విద్యార్థులు, నిర్వాహకులతో కలిపి కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. 

ఇందులో రిటైర్డ్​ డీజీపీ నండూరి సాంబశివ రావు , రిటైర్డ్​డీఐజీ తోట వెంకటరావు , డాక్టర్ రావూస్​ఈఎన్​టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్  రావు , సినీ రచయిత మరుధూరి రాజా, తలవర్జుల శివాజీ , సీనియర్ జర్నలిస్ట్ ఆదిపూడి గాయత్రి ప్రసాద్, పారిశ్రామిక వేత్త కురవి రఘురామ్, డాక్టర్​శ్రీని పేర్ల, ధారా శ్రీవల్లి, బయ్యవరపు రాజ్యలక్ష్మి, కో కన్వీనర్లు శ్రీమతి సీతాపద్మ, సీతా, అరుణ పాల్గొన్నారు.