కొండగట్టుకు వెళ్తుండగా జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూ కళాశాల దగ్గరలోని కెనాల్‌లో క్వాలిస్ వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మొత్తం 12 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ముగ్గురు చిన్నారులు, ఐదుగురు మహిళలు ఉన్నారు.
ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు క్వాలిస్ వెహికల్ బ్రేకులు ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని తెలిపారు. వేములవాడ దర్శనం అనంతరం కొండగట్టు అంజన దర్శనానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని చెప్పారు. గాయపడిన వారు వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలానికి చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన వారిని జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరో వైపు కొండగట్టు అంజన్న టెంపుల్ కు భక్తులు పోటెత్తారు. భారీగా తరలివస్తున్నారు. పలు జిల్లాల నుంచి భక్తులు పెద్ద మొత్తంలో వస్తున్నార. దీంతో ఘాట్ రోడ్డులో వాహనాలు నిలిచియాయి. ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
