రాజ్యాధికారం కోసం బీసీలు పోరాడాలి : ఆర్. కృష్ణయ్య

రాజ్యాధికారం కోసం బీసీలు పోరాడాలి : ఆర్. కృష్ణయ్య
  • రిజర్వేషన్లపై తేల్చాల్సిందే: ఆర్. కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై గత 35 ఏండ్లుగా  పోరాటాలు చేస్తున్నామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య అన్నారు. ఇకనైనా రిజర్వేషన్ అంశాన్ని తేల్చాల్సిన అవసరం ఉందని, ఉపేక్షిస్తే రాజ్యాధికారం కోసం బీసీలు బలమైన పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం విద్యానగర్‌‌లోని బీసీ భవన్‌‌లో బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షుడు అనంతయ్య అధ్యక్షతన జాతీయ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి ఆర్. కృష్ణయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ కుమార్ హాజరయ్యారు. సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా గుజ్జ కృష్ణను నియమిస్తున్నట్లు నిర్ణయించారు. అనంతరం ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. 35 ఏండ్లుగా  బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటాలు చేసినా పాలకులకు కనువిప్పు కలగడం లేదని మండిపడ్డారు.