రాష్ట్రంలో మరో 3 రోజులు భారీ వర్షాలు

రాష్ట్రంలో మరో 3 రోజులు భారీ వర్షాలు

తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణశాఖ. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని.... దీని ప్రభావంతో వచ్చే 3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది.   హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ జారీచేసింది. ఇవాళ హైదరాబాద్ లో అక్కడక్క భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం పడుతోంది. మంగళవారం రాత్రి మొదలైన వర్షం....  ముసురు, చిరు జల్లులతో పడుతోంది. చాలా ఏరియాల్లో వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మేడ్చల్ మల్కాజ్ గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, సహా సిటీ శివారు ప్రాంతాల్లో వర్షం పడింది. సిటీలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, కోటి ఏరియాల్లో వాన కురిసింది. ఇటు సిటీ శివారు ప్రాంతాల్లోని రాజేంద్రనగర్, మైలార్ దేవ్ పల్లి, అత్తాపూర్, బండ్లగూడ, హిమాయత్ సాగర్, నార్సింగి, కోకాపేట ఏరియాల్లో వర్షం పడింది. ఇవాల్టి నుంచి ఉత్తర, ఈశాన్య జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు.