ఇదంతా రాజమౌళి వారణాసి సినిమా ప్రమోషన్ లో భాగమేనా.?

ఇదంతా రాజమౌళి వారణాసి సినిమా ప్రమోషన్ లో భాగమేనా.?

 

  • ఇవన్నీ వారణాసి సినిమా ప్రమోషన్ లో భాగమేనా.?
  •  ట్రిపుల్ ఆర్ టైంలోనూ కుమ్రం భీమ్ ,అల్లూరి కామెంట్లు
  • ఇపుడు వారణాసిలో నందిపై మహేశ్ బాబు అంటూ
  • జనాన్ని టాకీస్ లకు రప్పించడమే రాజమౌళి వ్యూహమా.?

బాహుబలి టూ వారణాసి

జక్కన్న మాస్టర్ స్ట్రాటజిస్ట్. రాజమౌళి బుర్రే బుర్ర.తన సినిమాలు ప్రమోలు చేసుకోవడంలో దిట్ట. ఇప్పటి వరకు ఆయన అధ్బుతమైన స్ట్రాటజిస్ట్ గా నిలుస్తూ వచ్చాడు. ప్రతి సినమాను సరికొత్త రీతిలో ప్రమోట్ చేయడంలో జక్కన్న రూటే సపరేటు,ఆయన ప్రమోషన్ స్ట్రాజటీ బాహుబలి నుంచి ఇప్పటి వరకు సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అదే సమయంలో ఇపుడు కూడా వారణాసి చుట్టూ వివాదం వెనుక కొత్త వ్యూహం ఏమైనా ఉందా అన్నది హాట్ టాపిక్ గా మారింది. 

హైదరాబాద్: దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి నిజంగానే వివాదంలో చిక్కుకున్నారా..? లేక వారణాసి ప్రమోషన్ స్ట్రాటజీని అమలు చేస్తున్నారా..? అన్నది హాట్ టాపిక్ గా మారింది. వారణాసి ప్రమోషన్ కోసం దర్శక ధీరుడు రాజమౌళినే ఇలాంటి పబ్లిసిటీ కోరుకుంటున్నారా? అంతా పక్కా ప్లాన్ గానే వివాదాన్ని రేకెత్తించాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదం రోజురోజుకు ముదురుతున్న క్రమంలో అసలు ఇదంతా కూడా జక్కన్న చెక్కిన ప్లానేనా అన్న చర్చ కూడా మొదలైంది. తన సినిమాలను ప్రజల్లో ఉండేలా చేయడంలో రాజమౌళిది మాస్టర్ బ్రెయిన్. ఏం చేసయినా తన సినిమా ప్రజల నోళ్లలో నానేలా చేస్తాడు. ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్' సమయంలో ఇటువంటి విమర్శల టైప్ స్ట్రాటజీని ఫాలో అయ్యాడు. కుమ్రం భీం, అల్లూరి సీతారామరాజు వేర్వేరు కాలాలకు సంబంధించిన వారైనప్పటికీ ఒకే స్క్రీన్ పై చూపించండం వివాదానికి కారణమైంది. దీనికి ఆయన చెప్పిన సమాధానం ఒక్కటే థియేటర్లకు వచ్చి సినిమా చూడండి.. అని.. ఆయన చెప్పి నట్టుగానే జనం టాకీస్ లకు వెళ్లారు సినిమా చూశారు. ఆ సినిమా సూపర్ హిట్టయింది.. ఆస్కార్ కూడా వచ్చింది. అంతకు ముందు  వచ్చిన బాహుబలి వాస్తవానికి నిజామాబాద్ జిల్లా బోధన్ బేస్డ్ స్టోరీ.. కానీ మాహిష్మతీ రాజ్యా న్ని జక్కన్న సృష్టించాడు. అప్పట్లో తెలంగాణ వాదులు దీనిని తప్పు పట్టారు. అది కాస్తా మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కానీ సినిమా రిలీజ్ తర్వాత హిట్టయింది.. దాని కొనసాగింపుగా బాహుబలి-2 కూడా వచ్చేసింది. అదీ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు మహేశ్ బాబు హీరోగా వస్తున్న వారణాసి సినిమాను కూడా ప్రమోట్ చేసేందుకే ఆయన హనుమంతుడిపై వ్యాఖ్యలు చేసి కావాలనే వాటిని వివాదాస్పదం చేయించుకుంటున్నారనే వాదన కూడా ఉంది.

పొలిటికల్ టర్న్

'హిందువులంతా కూడా 'వారణాసి' సినిమాను చూడకుండా బాయికాట్ చేయాలన్నారు. "రాజమౌళిని జైళ్లో వేస్తే హిందూ దేవుళ్ల గొప్పతనం అర్థం అవుతుంది. హిందువులు ఎవరూ రాజమౌళి సినిమాలు చూడకండి. అని గోషామహల్ ఎమ్మెల్యే  రాజాసింగ్ పిలుపినిచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ని మీడియా ప్రశ్నించగా రాజమౌళి నిండు నూరేళ్లు బతికి మంచిగా సక్సెస్ అవ్వాలని అమ్మవారిని కోరుతున్నాని చెప్పారు. “దేవుడు కరుణించి రాజమౌళి దేవుడిని నమ్మే విధంగా మార్చి.. ఆయన కరుణ కటాక్షాలు రాజమౌళిపై ఉండాలని కోరుకుంటున్నా'' అని అన్నారు. ఇదిలా ఉండగా రాజమౌళిపై హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ లో, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో రాష్ట్రీయ వాసర సేన ఫిర్యాదు చేసింది.